ఎస్వతిని అనే చిన్న దేశ ప్రధానమంత్రి కొవిడ్-19తో మృతి..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అనేక మంది ఆ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖుల వరకు ఆ మాయదారి వైరస్ ఎవరినీ విడిచి పెట్టడం లేదు. తాజాగా *ఎస్వతిని అనే చిన్న దేశ ప్రధానమంత్రి అంబ్రోస్ డ్లమిని (52) కొవిడ్-19తో చికిత్స పొందుతూ మరణించారు.*
ఎస్వతిని దేశంలో ప్రధానమంత్రి అంబ్రోస్ డ్లమిని కరోనాతో దక్షిణాఫ్రికాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఎస్వతిని దేశ ఉప ప్రధాని తెంబా మసుకు చెప్పారు.
కొవిడ్-19 నుంచి కోలుకోవడానికి వీలుగా అంబ్రోస్ ను దక్షిణాఫ్రికాకు తరలించినా, చికిత్స పొందుతూ మరణించాడని ఉప ప్రధాని తెంబా చెప్పారు.
అంబ్రోస్ 2018 నవంబరులో ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. 2018లో పోలాండులోని కటోవిస్ నగరంలో జరిగిన ప్రపంచ దేశాల సమావేశంలో వాతావరణ మార్పులపై అంబ్రోస్ డ్లమిని మాట్లాడారు.