“కార్తీక చిత్రకళ సమ్మేళనము” ముగింపు కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి..


శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైన పవిత్ర కార్తీకమాసం నందు శ్రీకాళహస్తి దేవస్థానం వారు నిర్వహించిన “కార్తీక చిత్రకళ సమ్మేళనము” ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుండి శ్రీకాళహస్తి క్షేత్ర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించే కళాఖండాలను ఒక్కొక్కటిగా చూసి వాటిని చిత్రీకరించిన కళాకారులకు అభినందనలు తెలియజేశారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ , రెండు తెలుగు రాష్ట్రాల నుండి శ్రీకాళహస్తి కళలను చిత్రీకరించడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కళాకారులు, కలల అభివృద్ధికి ఎప్పుడు వెన్నంటే ఉంటానని ఆయన అన్నారు. కలల ద్వారానే మనం ఈరోజు దేవుళ్ళని చూడగలుగుతున్నాము, అటువంటి చిత్రాలను చిత్రీకరించే కళాకారులు దైవాంశ సంభూతులుగా భావిస్తనన్నారు. కళాకారులు ద్వారా నే చరిత్ర తరతరాలు తెలుస్తుందని,కళల ద్వారా శ్రీకాళహస్తి ప్రాశస్త్యాన్ని తెలపడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ.ఓ గారిని అభినందించారు. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో వ్యయప్రయాసలకు ఓర్చి విచ్చేసినందుకు ప్రతి కళాకారుడికి శ్రీకాళహస్తి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. మీరు చిత్రీకరించిన ప్రతి చిత్రాన్ని రాబోయే సంవత్సరంలో ఆలయం తరఫున ఏర్పాటు చేసే క్యాలెండర్ లో ముద్రిస్తమన్నరు, అలాగే వీటిని ప్రత్యేకమైన గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేసి దానిలో ప్రదర్శన నిమిత్తం ఉంచుతామన్నారు.మీరు ఈరోజు మీరు చిత్రీకరించిన చిత్రాలు మీ తరతరాలు శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో నిలిచిపోతాయి అన్నారు. కళలు అంటే నాకు చాలా మక్కువ అని శ్రీకాళహస్తి పురాతన కళ అయిన కలంకారి అభివృద్ధి కోసం ఏపీ టూరిజం వద్ద 12 కోట్ల రూపాయలతో క్రాఫ్ట్ విలేజ్ నిర్మిస్తున్నామన్నారు. అంతేకాకుండా నేను ఏ ప్రముఖుని కలిసిన శ్రీకాళహస్తి కళాకారులు చిత్రీకరించిన కలంకారీ వస్త్రాన్ని మరియు చిత్రపటాన్ని ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాను దీని ద్వారానే నాకు కలలపై ఎంత మక్కువ ఉందో మీకు అర్థం అవుతుందన్నారు. శ్రీకాళహస్తి ఆలయ గోడలపై ఉన్న పురతనల చిత్రాలను మెరుగులు దిద్దేందుకు నా వంతు కృషి చేస్తానన్నారు. దానికోసం చిత్ర కళాకారుల సూచనలు సలహాలు తీసుకొని చిత్రాలను పునః చిత్రికిస్తమన్నరు.

అనంతరం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు కళాకారులు అందరిని సన్మానించారు, అలాగే కళాకారులందరూ కలిసి ఎమ్మెల్యే గారిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మోహన్ భార్గవ్, స్వర్ణ మూర్తి మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు ,చిత్ర కళాకారులు పాల్గొన్నారు.

About The Author