శేషాచలం అడవుల్లో కి ప్రవేశిస్తున్న స్మగ్లర్లును అడ్డు కున్న టాస్క్ ఫోర్స్ ఒకరు అరెస్ట్..
ఎర్రచందనం దుంగల కోసం శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న దాదాపు 15 మంది స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ అడ్డుకుంది. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాల ఆర్ ఎస్ ఐ వాసు, డీఆర్వో నరసింహ రావు టీమ్ మంగళవారం అర్థరాత్రి శ్రీవారి మెట్టు వద్ద కూంబింగ్ చేస్తుండగా, దాదాపు 15 మంది స్మగ్లర్లు అడవిలోకి ప్రవేశించడం కనుగొన్నారు. వీరు శ్రీవారి మెట్టు నడక మార్గం మీదుగా అడవిలోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయారు. అయితే ఒక స్మగ్లర్ ను పట్టుకో గలిగారు. అతని వద్ద మూడు జతల దుస్తులు ఉన్నాయి. బస్సులో రావడానికి తెల్లటి దుస్తులు, తిరుమల లో తిరిగేందుకు భక్తుని తరహాలో కాషాయం రంగు, అడవిలో సంచరించ దానికి మరో జత తెచ్చుకున్నాడు. ఇతను తమిళ నాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు, వెళ్లిచెరువు గ్రామానికి చెందిన కె. వేంకటేశన్ గా గుర్తించారు. ఇతనిని విచారించగా ఎర్రచందనం దుంగలు కోసం వచ్చినట్లు ధృవీకరించారు. ఇతనిని అరెస్టు చేసి, టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. సిఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.