ప్రాణాల మీదకి తెచ్చిన ఫేస్ బుక్ ప్రేమ…!
ప్రాణాల మీదకి తెచ్చిన ఫేస్ బుక్ ప్రేమ…!
ప్రేమ విఫలమైనందని యువతి ఆత్మహత్యా యత్నం…
ఫేస్ బుక్కులో పరిచయంతో ఏడాది కాలంగా ఒకరి నొకరు ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారు.. చాటింగులు, మెసెజ్ లతో పాటు కలసి మెలసి తిరిగారు…చివరకు ఇద్దరు కలసి పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి వచ్చి కొంత కాలంగా ప్రేమ మోజు ప్రేమాయణం సాగిస్తున్నారు… ఇంతలోనే ఆమె ప్రియుడు మరో యువతి మోజులో పడి ఇన్నాళ్ళు గాఢంగా ప్రేమించిన ప్రియురాలిని కాదని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు…ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు ప్రియుడు చేసిన మొసంతో కుమిలి పోయింది…రెండు నెలలుగా ప్రియుడితో ఎడబాటు జీర్ణించుకోలేక చావే శరణ్య మనుకుని ఇంట్లో పాడి పశువులకు పిడుదులను చంపడానికి వాడే బ్యూటక్స్ విషాన్ని ఊరు బయటకు వెళ్లి తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది…వరి మడిలో పనులు చేస్తున్న కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన బైకులో బాధితురాలిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్సలు పొందుతోంది…ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు…మదనపల్లి మండలం, మాలేపాడు పంచాయతీ, కత్తివారిపల్లెకు చెందిన రైతు దంపతులు చంద్రశేఖర్ శ్రీదేవిల కుమార్తె అక్కిం శ్రీలత ఇంటర్ చదువుతున్న సమయంలో హిందూపురంలో ఆటో నడుపుకునే వినోద్ కుమారుతో ఫేస్ బుక్కు ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది…చివరకు ఆ ప్రేమ విఫలమై ఆత్మ హత్యాయత్నంకు దారి తీసింది…..రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు…..