టాస్క్ ఫోర్స్ సిబ్బందికి కోవిడ్ సెకండ్ వేవ్ కిట్లు పంపిణీ…


ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ తిరుపతి, కడప, రైల్వే కోడూరు లకు చెందిన సిబ్బందికి మంగళవారం కోవిడ్ సెకండ్ వేవ్ కిట్లు పంపిణీ చేశారు. శ్యానిటైజర్, గ్లవుజులు, మాస్క్ లు, అడవుల్లోని కీటకాల బారినుంచి తప్పించుకోవడానికి నీమ్ ఆయిల్, బ్యాటరీ లైట్లు, కోవిడ్ నిరోధక టాబ్లెట్ లు సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు మాట్లాడుతూ సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. స్మగ్లర్లు దొరికినపుడు వారి నుంచి కరోనా సోకకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. శానిటైజర్ దగ్గరుంచుకోవాలని సూచించారు. డీఎస్పీ గిరిధర్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. ఇంకా మెడిసిన్ లు తెప్పించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ క్లినిక్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోవిడ్ కు అనుగుణంగా ఆహార అలవాట్లు మార్చుకోవాలని, అనుమానం ఉంటే వెంటనే చెక్ చేసుకోవాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటయ్య, ఆర్ ఐ భాస్కర్, సి ఐ వెంకట్ రవి, సిసి సత్యనారాయణ మాట్లాడారు. సమావేశంలో ఏవో నాగేశ్వరరావు, సి ఐ సుబ్రహ్మణ్యం, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, ఆర్ ఎస్ ఐలు వాసు, సురేష్, లింగాధర్, లక్ష్మణ్, రామమూర్తి పాల్గొన్నారు

About The Author