జనవరి 1,ఫాస్టాగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఫాస్టాగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి అని ప్రకటించింది. ఈ ఫాస్టాగ్ విధానం వల్ల టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గుతుందని.. వాహనదారులు తమ సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చునని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

ఇప్పటికే దేశంలోని ప్రధాన టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ విధానం అమలవుతోందన్న ఆయన.. ఫాస్టాగ్ లేని వాళ్ల కోసం ప్రత్యేకంగా ఓ క్యాష్ కౌంటర్ ఉంటుందని.. త్వరలోనే వాటిని కూడా క్రమక్రమంగా తొలగిస్తామని చెప్పుకొచ్చారు. కాగా, టోల్ గేట్ల వద్ద క్యాష్‌లెస్ సేవలను పెంచాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్ ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం విదితమే.

About The Author