అయోధ్యలో నిర్మిస్తున్న దివ్య భవ్య రామమందిరంలో పాలుపంచుకుందాం..


మన దేశంలో ఉన్న హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి..
మీ అందరికీ తెలిసిన విషయమే, మన శ్రీరాముని కోసం అదే రామమందిరం కోసం 500 సంవత్సరాల పోరాట ఫలితంగా #నాలుగు_లక్షల_50_వేల_మంది ప్రాణ త్యాగాలతో చివరకు భారత సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య రామ జన్మభూమి తీర్పు సుఖాంతమైంది.. వివాదాస్పద భూమి రాముడికే చెందుతుందని, అందులో రామాలయం నిర్మించుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పిన విషయం మనకు తెలిసిందే..
వారి ఆదేశానుసారం రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీన భారత ప్రధాని చేతుల మీదుగా అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం మీకు తెలిసిందే..
అయితే ఆ రామాలయ నిర్మాణానికి సుమారు 1500 కోట్లు అవసరంగా అంచనా వేశారు..

అయితే “రామాలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని చాలామంది ముందుకు వచ్చారు..” మొత్తం ఖర్చు తామొక్కరమే పెట్టుకుంటామని చాలా సంస్థలు ముందుకు వచ్చాయి కూడా..”
కానీ మన సంఘ పెద్దలు స్వామీజీలు, సాధుసంతులు నిర్ణయం ఏమిటంటే భవ్య రామమందిర నిర్మాణం కేవలం కొద్ది మంది చేతులతో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం దీనిలో భాగస్వామ్యం కావాలి, ఈ దేశంలో ఉన్న 25 కోట్ల హిందూ కుటుంబాల ( 100 కోట్ల హిందువుల ) భాగస్వామ్యం ఉండాలి అని సంకల్పించారు..”

అందులో భాగంగా “జనవరి 15 సంక్రాంతి నుంచి జనవరి 31 వరకు మన దేశంలో ఉన్న 6 లక్షల 50 వేల గ్రామాలలో ప్రతి హిందూ కుటుంబం నుంచి కనీసం పది రూపాయల నుంచి గరిష్ఠంగా వారికి ఎంత వీలైతే అంత అయోధ్య రామ జన్మభూమి నిధి సమర్పణ కమిటీ పేరుతో సమర్పణ తీసుకోవాలని నిర్ణయించారు..
ఈ కార్యక్రమం గ్రామాలలో ఒక పండుగ వాతావరణంలా జరగాలి‌. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మన హిందువులు అందరిలో ఒక చైతన్యం రావాలి..
“మన శ్రీరాముని మందిరం కోసం మనమంతా ఒక్కటే మనం హిందువులం ధర్మ బందువులం అనే స్ఫూర్తి రావాలి..”
ఈ దేశంలో ఉన్న హిందూ బంధువులందరూ మీ మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి‌ అని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నాము. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ పరిచయస్తులకు ఈ విషయాన్ని తెలియజేయాలి. “ఈ కార్యక్రమం ఉద్దేశం కేవలం డబ్బు సేకరణ కాదు, హిందువులందరిలో మనమంతా భారతీయులం ఆ శ్రీరాముని వారసులం అనే భావన కలిగేలా స్ఫూర్తి నింపడం..” ఈ విషయాన్ని అందరూ గమనించాలి.

“రాముడు పుట్టిన నా దేశంలో, రాముడు పుట్టిన అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిర నిర్మాణంలో నేను కూడా ఒక ఇటుక పేర్చాను. రాబోయే మన సంతతి ఆ దివ్య భవ్య నిర్మాణాన్నో సందర్శించినపుడు మా తండ్రి గారు, లేదా మా తాత గారు, లేదా మా ముత్తాత గారు కూడా ఈ మందిరంలో ఒక ఇటుక పెర్చారు అని సంత్రృప్తి చెందాలి. రామమందిర నిర్మాణం సమయంలో నేను జీవించి ఉండడం నా అదృష్టం. నా పూర్వజన్మ సుకృతం అని మనం భావించి, మనందరం ఈ రామకార్యంలో పాల్గొని మన జన్మ చరితార్థం చేసుకుందాం..”

About The Author