రాజకీయ నాయకుల అండదండలతో స్క్రాప్ వ్యాపారులు మూసీ కబ్జా..
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ప్రమాదాలు..
అంబర్పేట్ నియోజకవర్గంలోని మూసి పరివాహక ప్రాంతాలు కబ్జాకు గురవుతున్నాయని, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోల్నాక మూసి నాలా బ్రిడ్జి పక్కన గల స్క్రాప్ షాప్ యజమాని మూసి ప్రాంతాలను కబ్జా చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు.గతంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతనంగా ఏర్పాటు చేసిన టాయిలెట్ డబ్బాలను స్క్రాప్ సామాన్లు వేసి వాడుకంటున్నారు. మరోపక్క దర్గా వెనుకాలో గల రోడ్డుపై వాహనాలను పార్క్ చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. స్క్రాప్ సామాన్లను రోడ్డుపై పెట్టి వాహనదారులను నానా ఇబంద్దులకు గారిచేస్తున్నారు.వీరిపై పోలీసులు కూడా ఎలాంటి చెర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ప్రజా ప్రతినిధులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో స్క్రాప్ సామాన్ల వ్యాపారం చేసే యజమానులు రెచ్చిపోతున్నారు అని స్థానికులు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కలగా చేసుకోవాలని కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు తక్షణమే వీరిపై చర్యలు తీసుకొని, ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ లను ఆధునీకరించడంతో పాటు టాయిలెట్లను క్రాప్ సామాన్లకు వాడుకుంటున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.