పీలేరులో ఎల్లమ్మ ఆలయం ధ్వంసం
– పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ ధర్మకర్త
– ఆలయాన్ని పరిశీలించిన మదనపల్లి డిఎస్పీ
పీలేరు పట్టణ శివారులో యల్లమ్మ ఆలయం ధ్వంసం. బుధవారం ఆలయ ధర్మకర్త దార్ల చంద్ర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వి వరాలు ఇలా ఉన్నాయి. పీలేరు- మదనపల్లె మార్గంలోని సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న పెద్దిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న దార్ల చంద్ర ధర్మకర్తగా నాలుగు కుటుంబాలకు చెందిన వారు ఇటీవల వారి కులదైవమైన మోసపల్లి యల్లమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఆ ఆలయాన్ని రెండు రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. చంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న స్థానిక తహశీల్దారు పుల్లా రెడ్డి, ఆర్ఐ అబ్దుల్ ఖాదర్, సిబ్బంది మరియు మదనపల్లి డిఎస్పీ రవిమనోహరాచారి, పీలేరు రూరల్ సిఐ మురళీ కృష్ణ, ఎస్సైలు తిప్పేస్వామి, శివకుమార్,
సిబ్బందితో కలసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల విగ్రహాలు ధ్వంసం చేయడం వంటి అనాగరిక చర్యల పరంపర నేపథ్యంలో పీలేరులో ఆలయాన్ని ధ్వంసం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఫోటోలు: ధ్వంసమైన ఆలయ దృశ్యం (27పీలేరు 03)
– సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (27పీలేరు 04)