మదనపల్లె హత్యల్లో దిమ్మతిరిగే ట్విస్ట్: అంతా పెద్దమ్మాయి డైరెక్షన్‌లోనే..


మదనపల్లె హత్యల్లో దిమ్మతిరిగే ట్విస్ట్: అంతా పెద్దమ్మాయి డైరెక్షన్‌లోనే.. తల్లిదండ్రులను పూర్తిగా నమ్మించి..!

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద కూతురు అలేఖ్య గురించి దిమ్మతిరిగే విషయాలు బయటకు వస్తున్నాయి.
 
?
ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో సంచలనం
అలేఖ్య గురించి షాకింగ్ నిజాలు
ఇంతకీ ప్రభావితం చేసింది ఎవరు??

పెద్ద కూతురు అలేఖ్య, పురుషోత్తం ఫ్యామిలీ
చిత్తూరు జిల్లా మదనపల్లె ఇద్దరు కూతుళ్ల హత్యల కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మొత్తానికి పెద్దమ్మాయి అలేఖ్య (27)నే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు వారాల క్రితం పెంపుడు కుక్కతో బయటకు వెళ్లిన చిన్నకూతురు సాయి దివ్య.. బయట ఏదో ముగ్గు తొక్కినట్లు అనుమానపడింది. అప్పటి నుంచి తాను చనిపోతానంటూ భయంతో ఏడుస్తూ ఉండేది. అంత బాధగా ఉంటే చనిపోవాలని.. తాను మళ్లీ బతికిస్తానని అలేఖ్య రెచ్చగొట్టింది.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 23వ తేదీన భూత వైద్యుడితో తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ దివ్యకు తాయెత్తులు కట్టించారు. అయినా ఈ నెల 24న మధ్యాహ్నం దివ్య తాను చనిపోతానంటూ ఏడుస్తూ ఇంట్లో మేడపైన ఉన్న తన గదిలోకి వెళ్లింది. తల్లిదండ్రులు, అలేఖ్య మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గదిలోకి వెళ్లి దివ్యకు వేపాకులతో మంత్రాలు చేశారు. అయినా కూడా దివ్య ఇం గట్టిగా ఏడవడం ప్రారంభించడంతో ఇక లాభం లేదనుకుని తల్లిదండ్రులు డంబెల్‌తో తలపై మోది చంపేశారు. తర్వాత శూలంతో పొడిచి.. ముఖాన్ని చెక్కేశారు.

ఇది జరిగిన నాలుగు గంటల తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో దివ్యను చంపినట్లుగానే తనను కూడా చంపెయ్యాలని అలేఖ్య తల్లిదండ్రులను కోరింది. తాను కూడా చనిపోయి చెల్లి దివ్యను తీసుకొస్తానని తల్లిదండ్రులను కోరింది. తాను పునర్జన్మలపై ప్రయోగాలు చేశానని.. కుక్కను ఇలాగే చంపేసి బతికించానని తల్లిదండ్రులకు అలేఖ్య నమ్మబలికింది. తర్వాత పూజ గదిలోకి వెళ్లి గుండు కొట్టుకుని, బట్టలన్నీ విప్పేసి.. ఒక చీర వంటి బట్టను ధరించింది. అనంతరం నవ ధాన్యాలు పోసిన రాగి చెంబును నోట్లో పెట్టుకుని పూజ గదిలో కూర్చుంది. తర్వాత కొన్ని పూజలు చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో అలేఖ్యను దివ్య మాదిరిగానే డంబెల్స్‌తో కొట్టి తల్లిదండ్రులు చంపారు. ఇలా, చెల్లిని తల్లిదండ్రులతో కలిసి చంపిన అలేఖ్య.. చనిపోయిన దివ్యను తీసుకొస్తానని తల్లిదండ్రుల చేతిలో హతమైంది. పునర్జన్మలపై విశ్వాసమే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు

About The Author