ఇంతకీ గాంధీని చంపిన గాడ్సే ఎవరు?
1. నాథూరామ్ గాడ్సే ఉగ్రవాదో, సీరియల్ కిల్లరో కాదు! ఆయన పూర్తి శాఖాహారియైన మరాఠీ బ్రాహ్మణుడు!
2. గాంధీని చంపటానికి ముందుగాని, తరువాతగాని మరో హత్య చేయలేదు.
3. గాంధీని అందరి ముందు నిర్భయంగా చంపాడు. చంపాక పారిపోలేదు. పోలీసులకి లొంగిపోయాడు.
4. గాంధీని చంపినందుకు ఉరి శిక్ష వేసింది కోర్టు. కానీ, తాను చేసింది తప్పని భావించని గాడ్సే క్షమాభిక్ష కోరలేదు. కోరి వుంటే క్షమాభిక్ష పెట్టే అవకాశం నాడు కొంత మేర వుండింది.
5. గాడ్సే చదవు, సంధ్యలు లేని వీధి రౌడీ కాదు. ఆయన జర్నలిస్ట్. స్వంతంగా పత్రిక నడిపేవాడు.
6. గాంధీని చంపాలని అనుకున్న మరుక్షణం… తన తరువాతి రోజు పత్రిక ప్రతి కోసం ఎడిటోరియల్ రాసి గాంధీని చంపటానికి వెళ్లాడు.
7. ఎడిటోరియల్ లో ఎవరో వచ్చి ప్రమాదాన్ని అరికడతారని కూర్చుంటే నిండా మునిగిపోతాం అనీ, స్వంతంగా మనల్ని మనమే రక్షించుకోవాలని గాడ్సే బోధించాడు!
8. గాంధీ నెహ్రుకి లొంగటం, నెహ్రు ప్రధాని కావాలని కలలుగనటం, జిన్నా కూడా తాను ప్రధాని అవ్వాలని భావించటం వల్ల పాకిస్తాన్ ఏర్పడిందని గాడ్సే నమ్మాడు. ఆనాడు చాలా మంది ఈ వాదన చేసే వారు. నెహ్రుని నియంత్రించటంలో గాంధీ విఫలమయ్యాడని భావించిన గాడ్సే ఆయన భారత ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి పాకిస్తాన్ కు 55 కోట్లు ఇప్పించటాన్ని సహించలేకపోయాడు. గాంధీ అనేక ఆశల్లో ఆనాడు తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ లు గా వున్న ఈనాటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లకు దిల్లీ మీదుగా హైవే కూడా ఒకటి! పాకిస్తాన్ కోసం దిల్లీ మీదుగా జాతీయ రహదారి అనే ఆలోచన గాడ్సేకి ఆగ్రహం తెప్పించింది. ఇంకా కోట్లాది మందిది అదే పరిస్థితి!
9. మనమిచ్చిన 55కోట్లతో మన మీదకే యుద్ధానికి వచ్చి మన సైనికుల్ని చంపి, మన కాశ్మీర్ ను ఆక్రమించింది పాకిస్తాన్. దీనికి పరోక్షంగా కారకుడు ముస్లిమ్ పక్షపాతి అయిన గాంధీ అని గాడ్సే భావించాడు! గాడ్సే తూటాలు పేల్చటానికి ప్రధాన కారణం అదే….
10. ముఖ్యమైన విషయం : గాడ్సే విద్యార్థిగా వున్నప్పుడు, చాలా రోజుల పాటూ… గాందీయవాది. కానీ, తరువాత ఆయనలో వచ్చిన మార్పు వల్ల గాంధీ వ్యతిరేకి అయ్యాడు. గాంధీ హిందువుల సంక్షేమాన్ని పణంగా పెట్టి దేశం విషయంలో దేశ ద్రోహులకు పాకిస్తానీ ల బాగు కోరుతున్నారని గ్రహించిన మరుక్షణం గాడ్సే గాంధీ బద్ధ| విరోధిగా మారాడు. గాడ్సే లాగా గాంధీని వ్యతిరేకించిన వారు అప్పట్లో కోట్లాది మంది! భగత్ సింగ్ బోస్ సర్దార్ సవర్కార్ కూడా గాంధీ వ్యతిరేకులే!