1) న్యూయార్క్ నగరము మాదిరిగా వీధులు రూళ్ళకర్రతో గీసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత.
2) ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ.
3) ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ మద్రాసుగానూ,
4) చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ ముంబయిగానూ,
5) ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్ గానూ,
6) భారతీయ ప్రామాణిక కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 82.5 ఉత్తర రేఖాంశం కాకినాడ మీదుగా పోతుంది.
7 ) సగటున కాకినాడ ఊరంతా సముద్రమట్టానికి 2 మీటర్లు ఎత్తులో ఉన్నప్పటికీ, పట్టణంలోని చాలా ప్రాంతాలు సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నాయి.
8 )సముద్రతీరానికి సమాంతరంగా, ఉత్తరం నుండి దక్షిణంగా ఒక దీర్ఘచతురస్రం మాదిరిగా నగరం ఉంటుంది.
? వస్త్ర వాణిజ్యం ఎక్కువగా జరిగిన ఈ ప్రాంతంలో డచ్చివారి కోట కూడా ఉండేది.
9) ఈ ప్రాంతంలో ఉన్న మడ అడవులు, భారతదేశంలో అతి పెద్ద మడ అడవులలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.
10) కోరంగి అభయారణ్యానికి నెలవు. గోదావరికి పాయలలో ఒకటైన ‘గౌతమి’, కాకినాడకి దక్షిణంగా బంగళాఖాతంలో కలుస్తోంది.
11) కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ (హోప్ ద్వీపం) చేత పరిరక్షింపబడుతున్నది.
12 ) రెండు శతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ నాయకర్‌ అనే ఆసామీ ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయన వారసులు మల్లాది సత్యలింగ నాయకర్‌ ఛారిటీస్ (MSN Charities) అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారు.
13) ఇక్కడి జె ఎన్ టి యు కళాశాల భారదేశంలోని అతి పురాతనమైన, అత్యుత్తమమైన ఏలెక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ శాఖలను కలిగి ఉంది.
14 ) నిజాం కాలంనాటి ప్రధాన రైలు, “సర్కార్ ఎక్స్ ప్రెస్” ఇప్పటికీ, కాకినాడ – చెన్నై ల మధ్య నడుస్తోంది.
15 ) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్ వైమానిక దళం, కాకినాడ మీద 1942 ఏప్రిల్ 6న దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఓడలు పూర్తిగా ధ్వంసం కాగా, ఒకరు మృతి చెందారు.
16 ) నాగార్జున ఎరువుల కర్మాగారం (కోస్తా ఆంధ్రలో అత్యధికంగా యూరియా ఉత్పత్తి చేసే కేంద్రం) ,కో రమాండల్ ఎరువుల కర్మాగారం (డై అమ్మోనియం హైడ్రోజన్ ఫాస్పేట్ ఉత్పత్తి జరుగుతోంది అందుకే కాకినాడని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు “ఎరువుల నగరం (Fertilizer City)”గా కూడా పిలుస్తారు
17 ) కాకినాడ పరిసర ప్రాంతాల నుండి, కొబ్బరికాయలను ఎగుమతి చేసే సంస్థలు చాలా ఉన్నాయి.
18 ) మురుగప్ప గ్రూపువారి ఈద్ పారీ (ఇండియా) మరియు కేర్గిల్ ఇంటర్నేషనల సంస్థల ఉమ్మడి పంచదార కర్మాగారం అయిన సిల్క్ రోడ్ సుగర్స్, 600,000 టన్నుల సామర్థ్యం కలది. ఇది, ప్రధానంగా ఎగుమతి ఆధార పరిశ్రమ(Export Oriented Unit)
19 ) 2002 సంవత్సరంలో, కాకినాడ పరిసరాల్లో అనేక వంటనూనె కర్మాగారాలు స్థాపించబడ్డాయి. అదానీ విల్మార్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, నిఖిల్ రిఫైనరీ, భగవతి రిఫైనరీ, మొదలైనవి రోజుకి 3000 టన్నులకి పైగా వంటనూనెలను ఉత్పత్తి చేయగలవు. ఈ కర్మాగారాలకి అవసరమైన ముడి పామాయిల్, సోయాబీన్ నూనె, ఓడరేవునుండి దిగుమతి అవుతున్నాయి
20 ) నాణ్యమైన జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు వాడే ఈ జత్రోఫా పంటని సాగుచేసేందుకు, కాకినాడ పరిసరాల్లో 200 ఎకరాలను కంపెనీ సేకరించింది.
21 ) కాకినాడ పరిసర ప్రాంతాలలో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు చాలా ఉన్నాయి. ఉప్పాడ బీచ్ రోడ్డునందు, స్పెక్ట్రం పవర్ జనరేషన్ సంస్థకి 208 మెగావాట్ల కేంద్రం ఉన్నది.
22 ) ఆంధ్రప్రదేశ్ ఐ.టీ పరిశ్రమలో కాకినాడ ద్వితీయ శ్రేణి నగరంగా పరిగణింపబడుతోంది.
23 ) ఉభయ గోదావరి జిల్లాల్లోని ఐ.టీ కంపెనీల సంఘం అయిన “గోదావరి ఐ.టీ అసోసియేషన్” (GITA), కాకినాడ కేంద్రంగా పనిచేస్తోంది
24 ) 2012-13 సంవత్సరంలో కాకినాడ నుండి రూ 35 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరిగాయి. ఈ ఎగుమతులలో హైదరాబాదు, విశాఖపట్నం తర్వాత కాకినాడది మూడో స్థానం
25 ) కాకినాడలో ఉన్న ఆంధ్రా ఎలక్ట్రానిక్స్ లి. సంస్థ, 1977 నుండి ఎలక్ఱ్రానిక్ వస్తువులను తయారుచేస్తోంది.
26 ) ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరింగు కళాశాల. జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇంజనీరింగు కళాశాల (JNTU Engineering College).
27 ) కాకినాడలో వున్న ప్రఖ్యాత మెక్లారెన్ స్కూలు వంద సంవత్సరాల చరిత్ర గలది.
28 ) ఆసియా లో మొదటి బయో డీజల్ తయారి ఇక్కడ కలదు.
29 ) కాకినాడ పరిసరాల్లోని సామర్లకోట గ్రామంలో ఉత్తరాయణం – దక్షిణాయనం మధ్య కాలంలో శ్రీభవన్నారాయణస్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు.
30 ) పావులూరి మల్లన – 11వ శతాబ్దానికి చెందిన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. గణితసార సంగ్రహము అనె గణితగ్రంధాన్ని వ్రాశాడు. దీనికే పావులూరి గణితము అని పేరు.
మల్లాది సత్యలింగం నాయకర్- 19వ శతాబ్దానికి చెందిన వాణిజ్యవేత్త, సంఘసేవకుడు.
31 ) కాకినాడ ఊరు పేరు చెప్పగానే నోరూరే విషయాలు రెండు. ఒకటి కోటయ్య కాజాలు. ఇవి తాపేశ్వరం మడత కాజాల వంటి కాజాలు కావు. సన్నంగా, కోలగా దొండకాయలాగా ఉంటాయి. , కొరగ్గానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తుంది. వీటిని గొట్టం కాజాలని కూడా అంటారు. తరువాత చెప్పుకోవలసినది నూర్జహాన్ కిళ్ళీ. ఇది తుని తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళీ. అలాగే కాకినాడలోని సుబ్బయ్య హోటలు. సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే ఇక్కడి అద్భుతమయిన భోజనానికి చాల ప్రశస్తి ఉంది.
32 ) డీప్ వాటర్ పోర్ట్ నిర్మించక ముందు నుండీ ఉన్న కాకినాడ లంగరు రేవు, భారతదేశంలోని 40 చిన్న ఓడరేవులలో అతిపెద్దది.

About The Author