కేరళ వెంబనాడ్ సరస్సు సంరక్షకుడిని ప్రశంసించిన ప్రధాని


73 వ మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్రమోది కేరళ వెంబనాడ్ సరస్సు సంరక్షకుడు రాజప్పన్‌ను అభినందించారు.
ప్రతి ఒక్కరికి రాజప్పన్ ఒక రోల్ మోడల్ అని ప్రధాని కొనియాడారు . కొట్టాయం కుమారకోం నివాసి అయిన రాజప్పన్ వెంబనాడ్ సరస్సులో విసిరేసిన సీసాలు సేకరించి అవి అమ్మి జీవిస్తుంటాడు. పుట్టుకతోనే రెండు కాళ్లు పనిచెయ్యక పోయినప్పటికీ, అతను ఈ గొప్ప పని చేస్తున్నాడు,అతని వల్లే వెంబనాడ్ సరస్సు చాలా పరిశుభ్రంగా ఉందని ప్రధాని ప్రశంసించారు.

బాటిల్స్ అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం జీవించడానికి చాలా తక్కువ అయినప్పటికీ, రాజప్పన్ జీవితం సీసాలు అమ్మడం పైనే ఆధారపడి ఉంటుంది. ఉదయం 6 గంటలకు రాజప్పన్ పడవతో సరస్సు వద్దకు వెళ్తాడు. ఒక్కోరోజు తిరిగి రావడానికి రాత్రి కూడా అవుతుంది.అతను పెద్దగా ఆశపడడు .అతను సేకరించిన సీసాలకు న్యాయమైన ధర మాత్రమే కోరుకుంటాడు. రాజప్పన్ ఆరేళ్లుగా ఈ పని చేస్తున్నాడు. అతని ఇళ్లు కూడా శిధిలావస్థలో ఉంది. ఇంటికి కరెంట్ సప్లై కూడా లేదు, కొవ్వొత్తి వెలిగించుకుని ఆ ఇంట్లో ఉంటూ ఈ పని చేస్తూ జీవిస్తుంటాడు, రాజప్పన్ తన చేస్తున్న పనిపట్ల సంతోషంగా ఉన్నానని అంటున్నాడు, ప్రధాని మన్ కి బాత్ లో తన పేరుని తను చేస్తున్న పనిని ప్రస్తావించడం పట్ల ప్రధానికి ధన్యవాదాలు అన్నాడు.

About The Author