హిందూ దేవాలయాలను రక్షించుకోవాల్సింది వారే…?


హిందూ దేవాలయాలు కూడా ఈ మధ్య కాలంలో అతి ముఖ్యమైన రాజకీయ అంశాలుగా మారిపోతున్నాయి. కాదేదీ రాజకీయానికి అనర్హం అన్నట్లుగా పాలిటిక్స్ మధ్యలోకి దేవుళ్ళను తీసుకు వచ్చేస్తున్నారు.
అయితే హిందువులు చెట్టును పుట్టను కూడా నమ్ముతారు. నడిచే తోవలో రాయి కనిపించినా మొక్కుతారు. ఇలా ఆస్తిక జనుల నమ్మకాలను తూట్లు పొడిచేలా తాజాగా కొన్ని ఘటనలు కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. వేలాదిగా ఉన్న దేవాలయాలకు రక్షణ కల్పించ‌డం అంటే ఏ ప్రభుత్వాల తరం కూడా కాదు.
దేవుడి పట్ల ‌తమ భక్తిని నిండుగా చాటుకునే భక్తులే ఆలయాల పరిరక్షణకు పూనుకోవాలని సాధుసంతులు కూడా చెబుతున్న మాట. ఇదే మాటను పుష్పగిరి శ్రీ శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతులు శ్రీ విద్యా శంకర భారతీ స్వామి వారు కూడా సెలవిచ్చారు.
హిందూ దేవాలయల రక్షణ బాధ్యతను భక్తులే తీసుకోవాలని ఆయన తాజాగా పిలుపు ఇచ్చారు. ఉత్తరాంధ్రా జిల్లాల పర్యటనలో ఉన్న స్వామీజీ హింధూ ధర్మ పరి రక్షణ అందరి బాధ్యత అన్నారు. ఈ విషయంలో ప్రతీ హిందువూ చైతన్యం అయితేనే తప్ప విగ్రహాల విద్వంసం వంటి దురాఘతాలకు అడ్డుకట్ట పడదని స్వామీజీ స్పష్టం చేశారు.
మొత్తానికి స్వామీజీ భేష్ అయినా మాట చెప్పారు. రాజకీయ జీవులు ఈ విషయాన్ని తమ స్వార్ధానికి ఉపయోగించుకుంటున్న వేళ స్వాములు, ధార్మిక చింతన కలిగిన వారు చెప్పే ఉత్తమమైన మాటలే హిందూ జాతి జాగృతానికి ఈనాడు చాలా అవశ్యం.
అంతే తప్ప మడీ తడీ లేని వారు, హైందవ ధర్మం పట్ల కనీస అవగాహన లేని వారు రాజకీయాలు చేయడానికి హిందూ మతాన్ని వాడుకోవడం ఎంత తప్పు అన్నది కూడా ఆస్థిక జనులకు అర్ధం కావాలి. భక్తులకు భగవంతుడికి మధ్య ఏ రాజకీయం దూరకూడదు అన్నదే స్వాముల మాట.

About The Author