పాలిటిక్స్ లోకి నిమ్మగడ్డ?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు అయిందిపుడు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరు అంటే ఠక్కున జవాబు చెప్పలేరేమో కానీ నిమ్మగడ్డ విషయంలో మాత్రం అలా కానే కాదు. అంతలా ఆయన పాపులర్ అయ్యారు.
ఇదిలా ఉంటే ఏపీలో నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా ఇపుడు కధ సాగుతోంది. వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా నిమ్మగడ్డ మీద హాట్ కామెంట్స్ చేశారు.
ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడడమేంటని ప్రశ్నించారు. కడపలో నిమ్మగడ్డ మాట్లాడినవి ఆయన పదవికి ఏ మాత్రం తగినవి కావు అంటున్నారు.
తాము రాజ్యాంగబధ్ధంగా పనిచేస్తూంటే తమ మీద గవర్నర్ కి ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం ద్వారా నిమ్మగడ్డ ఏం చెప్పదలచుకున్నారని కూడా బొత్స అంటున్నారు. రాజ్యాంగం అందరికీ ఒక్కటేనని కూడా ఆయన అంటూ ప్రతీ వారు దానిని పాటించాలని సూచించారు.
ఇక నిమ్మగడ్డకు రాజకీయాలు అంటే ఇష్టం ఉంటే తన పదవికి రాజీనామా చేసి నేరుగా రావచ్చు అని కూడా బొత్స అంటున్నారు. మొత్తానికి నిమ్మగడ్డను రాజకీయాలోకి రమ్మంటూ బొత్స హాట్ హాట్ ఇన్విటేషనే పంపారుగా.