శ్రీరంగం – (108 లో మొదటి దివ్యదేశం) :
శ్రీరంగంలోని శ్రీరంగనాధస్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఆళ్వారులు అందరూ ఈ క్షేత్రం మహిమను గానం చేశారు. భారతదేశంలో అతి పెద్ద ఆలయసంకీర్ణాలలో ఒకటి (one of the largest temple complexes in India).
ఇచ్చట గర్భాలయములో శయనించియున్న మూర్తికి “పెరియ పెరుమాళ్” అని పేరు. ఉత్సవ మూర్తికి ‘నంబెరుమాళ్’ అనిపేరు.
శ్రీరంగ క్షేత్ర విమానం లో వేంచేసి ఉన్న పరవాసు దేవులు మనం ఎప్పుడు వచ్చి శ్రీరంగ నాధుని దర్శనం చేస్తామా అని మనకు 60 సంవత్సరాలు వచ్చే వరకు ఎదురు చూసి ఆతర్వాత మన పేరు తీసేస్తారు అని పురాణ కధనం, అంటే మనకు 60 సంవత్సరాలు వచ్చే లోపు తప్పని సరిగా శ్రీరంగ నాధుని దర్శనం చేయాలని పెద్దల ఉద్దేశ్యం.
బంగారు స్థంభాలు:
గర్బాలయములో శ్రీరంగనాథుని ఎదుటగల బంగారు స్తంభములకు “తిరుమణై త్తూణ్” అని పేరు. శ్రీరంగ నాధుని సౌందర్య సముద్రములో పడి కొట్టుకొని పోవు వారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొంటారు.
శ్రీరంగ క్షేత్ర స్థలపురాణం ను చక్కటి విశ్లేషణ తో అద్భుతంగా చిత్రీకరించి మనకందించిన SVBC వారికి కృతజ్ఞతలు ..
ఇటువంటి దివ్యమైన క్షేత్రాలు అన్ని చక్కటి ప్రణాళికతో వెళ్ళి దర్శించుకోవాలి. ఏదో హడావిడి గా మూడు నాల్గు రోజుల్లో 10-15 క్షేత్రాలు దర్శించడం వల్ల ఆలయ ప్రాముఖ్యతను, వైభవాన్ని తెలుసుకునే అవకాశం ఉండదు.
క్షేత్ర దర్శనానికి కనీసం ఒక నెల రోజుల ముందునుండి మనం దర్శింపబోయే ఆలయం గొప్పతనం గురించి తెలుసుకుంటూ ఉండాలి.. అక్కడ స్వామి ఎందుకు వెలిశారు ? ఎవెరెవరిని అనుగ్రహించారు ? ఏయే సమయాలలో స్వామికి ఎటువంటి కైంకర్యాలు జరుగుతాయి వంటివి క్షుణ్ణంగా తెలుసుకొని వెళ్లగలిగితే స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అంతేకాక ఆ ఆలయము నకు సమీపంలో అనేకమైన ఇతర దివ్యమైన క్షేత్రాలు కూడా ఉంటాయి, వాటి వైభవాలు కూడా తెలుసుకొని వెళ్లగలిగితే సంపూర్ణ యాత్రా ఫలితం దక్కుతుంది.
శ్రీరంగం సమీపంలో సుమారు 5 దివ్యదేశాలు (108 దివ్యదేశాలు లలో ) అన్నీకలిపి 70-80కిమీ పరిధి లోనే ఉన్నాయి.
Places to visit at SriRangam :
001 శ్రీరంగం
002 నాచ్చియార్ కోయిల్, ఉఱైయూర్ – Nachiyar Koil Woraiyur ( 7km )
003 ఉత్తమార్ కోవిల్ , కరంభనూర్ – Uthammar Koil,Karambhanoor (4km) 004 తిరువెళ్ళరై – Thiruvellarai : (16km)
005 తిరు అన్బిల్ – Anbil : (30km)
006 తిరుప్పేర్ నగర్ – Tiruppernagar (Koviladi) : (24km)
మరియు ప్రముఖ శైవ క్షేత్రం జంబుకేశ్వరం – Jambukeswar (శ్రీ చక్రం తో కూడిన చెవి తాటంకములు ధరించిన అఖిలాండేశ్వరి అమ్మవారు.)
ఇవన్నీ అక్కడ ఒక లోకల్ cab మాట్లాడుకొని చూసిరావచ్చు. మరొక ముఖ్య విషయం అక్కడ అన్ని ఆలయాలు మధ్యాహ్న సమయంలో(12 pm -4pm ) మూసివేస్తారు కనుక ఉదయం 5గం లకు మొదలు పెడితే మధ్యాహ్నానికి అన్ని చూడవచ్చు. అన్ని ఆలయాలు తీరిగ్గా చూడాలంటే కనీసం రెండురోజులు శ్రీరంగం లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
route Map: https://goo.gl/maps/3UBkpVJX2DNDGehn9