మైనర్‌పై ఐదు నెలలుగా.. 17 మంది
ఓ మైనర్ బాలికను అపహరించి.. అత్యాచారం చేయడమే కాక లైంగిక హింసకు పాల్పడ్డ ఎనిమిది మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఐదు నెలలుగా మృగాళ్లు బాలికపై అకృత్యానికి ఒడిగడుతున్నారు. ఇక పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బాధితురాలి బంధువు ఉండటం గమనార్హం. వివరాలు.. కర్ణాటక చిక్ మంగుళూరుకు చెందిన బాధితురాలి తల్లి మూడేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి ఆమె తన బంధువుతో కలిసి నివసిస్తూ.. స్థానికంగా ఉన్న స్టోన్ క్రషర్ సంస్థలో పని చేసేది. ఈ క్రమంలో బాలికకు గిరీష్ అనే బస్ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. బాధితురాలి గురించి పూర్తిగా తెలుసుకున్న గిరీష్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక దీని గురించి తన ఆంటీకి చెప్పింది. తోడుగా నిలబడాల్సిన ఆమె.. బాలికని బెదిరించి మరి కొందరి వద్దకు పంపింది. ఇక బస్ డ్రైవర్ గిరీష్ బాలికతో ఉన్న సంబంధం గురించి బయట చెప్తానని బెదిరించి స్మాల్ అభి అనే వ్యక్తి వద్దకు బాధితురాలిని పంపాడు. అభి బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టడమే కాక వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి పలుమార్లు ఆమెపై అకృత్యానికి ఒడిగట్టాడు. అతడి స్నేహితులు కూడా బాలికను అత్యాచారం చేశారు. ఇలా దాదాపు 17 మంది రాక్షసులు గత ఐదునెలలుగా బాధితురాలిపై రాక్షసకాండ కొనసాగిస్తున్నారు. దీని గురించి తెలియడంతో జిల్లా డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో స్మాల్ అభి, గిరీష్, వికాస్, మణికంట, సంపత్, అశ్వత్‌గౌడ, రాజేష్, అమిత్, సంతోష్, దీక్షిత్, సంతోష్, నిరంజన్, నారాయణ గౌడ, అభి గౌడ, యోగీష్, మైనర్ అత్త, ఎంజీఆర్ క్రషర్ యజమానిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. భారత శిక్షాస్మృతిలోని 201, 370 (అక్రమ రవాణా), 376 (3), 376 (ఎన్) సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, అనైతిక ట్రాఫిక్ నివారణ చట్టం, బాల కార్మిక సవరణ చట్టం, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ చట్టం) సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ దారుణంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి లావణ్య.. బీజేపీ ఎంపీ శోభా కరండ్లజే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరున్న కొందరు నిందితులకు బీజేపీతో సంబంధం ఉంది.. అందుకే వీరు మౌనంగా ఉన్నారని ఆమె ఆరోపించారు.