శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్‌ : బడ్జెట్‌ ధరలో


స్మార్ట్‌ఫోన్ ‌తయారీదారు శాంసంగ్‌ బడ్జెట్‌ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. గెలాక్సీ ఎంఓ2 పేరుతో దీన్ని భారత​ మార్కట్లో లాంచ్‌ చేసింది. శాంసంగ్‌ ఎం స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌లో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్‌ రియర్‌ కెమెరా, బిగ్‌ బ్యాటరీ, బడ్జెట్‌ ధర ప్రత్యేకతలుగా ఉన్నాయి.
ఫిబ్రవరి 9 నుంచి అమెజాన్, శాంసంగ్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉండనుంది. 2 జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ ధర రూ.6,999 గా ఉంచింది. అయితే పరిచయ ధరగా 6799 రూపాయలకు అందించనుంది. బ్లాక్‌, బ్లూ, గ్రే, రెడ్‌ కలర్లలో లభ్యం. దీంతోపాటు 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను కూడా ప్రకటించగా, ధర మాత్రం ఇంకా రివీల్‌ కాలేదు.

గెలాక్సీ ఎంఓ2 ఫీచర్లు
6.50 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 10
2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌
13+2 మెగా పిక్సెల్‌ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000ఎంఏహెచ్‌ బ్యాటరీ

About The Author