దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ప్రెస్ మీట్ పాయింట్స్..


*విగ్రహాల ధ్వంసం కేసుల్లో నిందితులను పట్టుకుంటే టీడీపీ, బీజేపీ అభ్యంతరం ఏంటి…?*

*మతసామరస్యం దెబ్బతీస్తే పోలీసులు పట్టుకుంటారా..! అని టీడీపీ-బీజేపీలు ప్రశ్నిస్తున్నట్లు ఉంది..*

*-గతంలో మోడీ-అమిత్ షా లను తిట్టి.. ఇప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి టీడీపీ ఎంపీలు వెళ్ళారా..?*

*-టీడీపీ హయాంలో 40 దేవాలయాలను కూల్చితే ఆనాడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు*

*-40 ఆలయాలు కూల్చినప్పుడు బీజేపీ నేత మాణిక్యాలరావే దేవాదాయశాఖ మంత్రి*

*- టీడీపీ-బీజేపీలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయ్‌*

*-విగ్రహాల విధ్వంసంపై సిట్ దర్యాప్తులో నిజాలు నిగ్గు తేలుతుంటే ఆ పార్టీలు భుజాలు తడుముకుంటున్నాయి*

*-విగ్రహాల విధ్వంసం వెనుక రాజకీయ నేతలున్నారు… సిట్‌ దర్యాప్తులో ఒక్కొక్కటీ బయటకొస్తున్నాయ్*

*- శ్రీకాకుళం జిల్లాలో నంది విగ్రహం తరలింపు కేసులో అరెస్టైనవారందరూ టీడీపీ నేతలే*

*-టీడీపీ, బీజేపీ నాయకులు మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు*

*ఆలయాలపై దాడులకు పూర్తి బాధ్యుడు చంద్రబాబు.. వాళ్ళు కూల్చిన దేవాలయాలను మేం పునఃనిర్మిస్తున్నాం*

*ఏపీ ప్రయోజనాల గురించి జీవీఎల్ ఎప్పుడైనా రాజ్యసభలో మాట్లాడారా?*

*అంతర్వేది ఘటన సీబీఐకి ఇస్తే కేంద్రం ఎందుకు స్పందించలేదు?*

*బాబు రాజకీయ జీవితం వెన్నుపోటు కుట్రతో ప్రారంభమైంది.. అదే కుట్రతో అథఃపాతాళానికి వెళ్లిపోతారు*

*రామతీర్థం ఆలయానికి అశోకగజపతిరాజు చెక్ ఇవ్వలేదు. విగ్రహాల తయారీకి మాత్రమే ఇచ్చారు*

*రామతీర్థం ఆలయ విగ్రహాలను టీటీడీ ఉచితంగా ఇచ్చిందని తెల్సే.. అశోకగజపతిరాజు చెక్‌ ఇచ్చారు*

*ఆలయానికి అశోకగజపతిరాజు లక్ష కాదు.. కోటి ఇచ్చినా స్వీకరిస్తాం*

*శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..*

1. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో బాధపడుతున్నట్లుగా మాట్లాడారు. 140 దేవాలయాలపై దాడులు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నట్లుగా జీవీఎల్ మాట్లాడారు. ఈ విషయంలో జీవీఎల్ నరసింహారావును నేరుగా ప్రశ్నిస్తున్నాను. 2014-2019 వరకు రాష్ట్రంలో దేవాదాయశాఖ మంత్రిగా బీజేపీ నాయకుడు మాణిక్యాలరావు ఉన్నారు. టీడీపీ, బీజేపీలు అంటకాగాయి. ఇరు పార్టీలు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి పదవులు ఇచ్చి భాగస్వామ్య ప్రభుత్వాలు నడిపారు. ఆరోజున బీజేపీ మంత్రి ఉన్నప్పుడు విజయవాడలో సుమారుగా 40 దేవాలయాలు కూల్చినప్పుడు ఒక్కసారైనా రాజ్యసభలో జీవీఎల్‌ గారు ప్రశ్నించారా? చంద్రబాబు, బీజేపీ కలిసి ఇన్ని దేవాలయాలు కూల్చామని ఎందుకు మాట్లాడలేదు. పైగా ఆనాడు కనీసం ఆవేదన కూడా పడలేదు. పైగా కూల్చిన ఆలయాలను నామరూపాలు లేకుండా చేశారు. విగ్రహాలను మున్సిపల్ చెత్తబండిలో వేసి చెత్తకుప్పలో పడేశారు. చరిత్రహీనులు మీరు. ఆనాడు ప్రశ్నించకుండా ఈరోజు శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారు. రాజ్యసభలో ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించేలా జీవీఎల్ చేసిన ప్రయత్నం కాదా ఇది.

2. ఇప్పటికే రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందాలని అనేక సంఘటనలు చేశారు. అయితే దాన్ని సిట్‌ దర్యాప్తు ద్వారా 16 మంది ఉన్నతాధికారులను వేసి పూర్తిగా ఒక్కో అంశాన్ని పరిశీలించి ఒక్కో నివేదిక బయటపెడుతుంటే.. తట్టుకోలేకపోతున్నారు. పట్టుకోలేకపోతే పట్టుకోలేదంటారు. పట్టుకుంటే మా వాళ్లను విడిపించండని అంటారు. ఇదంతా ఏంటండీ జీవీఎల్ నరసింహారావు గారు.

3. రాజమండ్రిలో ఘటన గురించి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అక్కడ అర్చకుడికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే.. దాన్ని ఆసరగా చేసుకొని టీడీపీ నాయకులు చేయించారని ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. పైగా టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేయటం కూడా జరిగింది. అవేమీ జీవీఎల్ నరసింహారావుకు కనపడటం లేదు. ఏదో 140 అంకెలు చెప్పి.. మొసలి కన్నీరు కారుస్తున్నట్లుగా దేవాలయాలపై కుట్ర జరుగుతున్నట్లు జీవీఎల్ రాజ్యసభలో మాట్లాడటం శోచనీయం.

4. రాజ్యసభలో రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి ఒక్కసారైనా మాట్లాడారా? నిధులు, పోలవరం, ఇతర ఇన్సెంటివ్స్‌ గురించి ఒక్కరోజు కూడా మాట్లాడని వ్యక్తులు ఈరోజు తగుదునమ్మా అంటూ హిందూ దేవాలయాలపై దాడులు అని చెప్పటం ఏంటి? దేవాలయాలపై దాడుల ఘటనలో పోలీసు శాఖ సాక్ష్యాధారాలతో సహా నిందితుల్ని పట్టుకుంటోంది. ఆ ఘటనల్లో బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. తద్వారా రాష్ట్రంలో హింసను, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి టీడీపీ, బీజేపీ నాయకులు ప్రేరేపిస్తున్నారు. ఇది సమంజసం కాదని మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను.

5. ఈరోజు టీడీపీ ఎంపీలు అమిత్‌షాను కలిశారట. 2019 ఎన్నికల సమయంలో అమిత్‌షాను, నరేంద్ర మోడీని చంద్రబాబు, టీడీపీ ఎంపీలు తిట్టినట్లు దేశంలో ఎవ్వరూ తిట్టలేదు. మా తప్పు అయిపోయిందని అమిత్‌షా కాళ్లు పట్టుకోవటానికి టీడీపీ ఎంపీలు ఈరోజు వెళ్లారు తప్ప వీరు వెళ్లటం వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ ఉండదు. అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో నంది విగ్రహం ఎత్తుకెళ్ళి రోడ్డు మీద పెట్టిన సంఘటనలో సీసీ పుటేజితో సహా టీడీపీ వాళ్లు దొరికిపోయారు. గర్భ గుడిలో నుంచి నంది విగ్రహాన్ని తీసుకొచ్చి నాలుగు రోడ్ల కూడలిలో పెట్టిన సీసీ కెమెరా పుటేజీ దొరికింది. సుమారుగా 20 మందిపైన కేసులు పోలీసులు పెట్టారు. ఏ1 నుంచి ఏ4 వరకు అందరూ టీడీపీ నాయకులే. వీళ్లే సీసీ పుటేజిలో దొరికిన వ్యక్తులు. వీళ్లలో అచ్చెన్నాయుడు ఏ21, ఏ2, ఏ12 ఫొటోలు దిగి ఉన్నారు. వీరంతా టీడీపీ వాళ్లే. వీళ్లను పట్టుకుంటే మా టీడీపీ వాళ్లను పట్టుకున్నారు. పట్టుకోలేకపోతే మీరు ఎవ్వరూ పట్టుకోలేదని విమర్శలు చేస్తారు.

6. రాష్ట్రంలో గుడులను కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలది. గుళ్లు కట్టిన చరిత్ర వైయస్‌ఆర్‌సీపీది. టీడీపీ దుర్మార్గంగా 40 గుళ్లు కూల్చేస్తే.. వాటిని ఈరోజు సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి పునర్‌ నిర్మిస్తున్నారు. కూల్చిన వాళ్లే దొంగే.. దొంగ అన్నట్లు కేకలు వేస్తున్నారు. చంద్రబాబు తీరు అలా ఉంది. సిట్ విచారణలో పూర్తి నిజాలు బయటకు వస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలకు భయం పెరిగింది. మత విద్వేషాలు రెచ్చగొడితే.. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని అoటున్నారు. ఈ మతవిద్వేషాలు రెచ్చగొట్టడం, దేవాలయాల్లో దుర్మార్గాలు జరగటానికి ముఖ్యకారకుడు చంద్రబాబు. చంద్రబాబు గుళ్లు కూల్చేస్తే .. మేం గుళ్లను పునర్‌నిర్మిస్తున్నాం. గుళ్లో లింగాలు దోచేయాలని చంద్రబాబు ప్రయత్ని్స్తున్నాడు. అందుకే సీసీ కెమెరాలు పెడుతున్నాం. అన్ని విధాలుగా పట్టుకుంటున్నాం. అంతర్వేది రథం ధగ్నం అవటం దురదృష్టకరమైన సంఘటన. అయితే, ఈ ప్రభుత్వం చక్కటి డిజైన్‌తో అంతర్వేధిలో రూ.1.20 కోట్లతో కొత్త రథాన్ని పునర్‌ నిర్మించి ఇస్తున్నాం. తాడేపల్లిగూడెంలో రథం ధగ్నమైతే ఏనాడూ చంద్రబాబు స్పందిచలేదు.

7. రామతీర్థంలో రాముని విగ్రహాలను తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా రూపొందించాం. అదేవిధంగా చంద్రబాబు పడగొట్టిన గుళ్లు పునర్‌ నిర్మిస్తున్నాం. కూల్చేసిన దుర్మార్గులు (టీడీపీ, బీజేపీ) వాళ్లైతే… నిర్మిస్తున్న మహానుభావుడు శ్రీ జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు కుట్రల్ని చేధించి తీరుతాం. నూటికి నూరు పాళ్లు హిందూ దేవాలయాలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈ రాష్ట్ర చరిత్రలో ఎండోమెంట్‌ శాఖ, దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి రూ.70 కోట్లు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానిదే. ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవ్వరూ కూడా నిధులు ఇవ్వలేదు. గుళ్లు కట్టిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఆలయాలు కట్టించిన దాఖలాలే లేవు. ఇటువంటివి చూసి ఓర్వలేక గుంటనక్క పనులు చేయటం చాలా బాధాకరం. దయచేసి రాజ్యసభలో మైక్‌ ఉందని రాష్ట్రంపై మచ్చ పడేవిధంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడటం సరికాదు.

8. చంద్రబాబు జీవితం వెన్నుపోటు కుట్రతో ప్రారంభమైంది. అదే కుట్రతో చంద్రబాబు అథఃపాతాళానికి వెళ్లిపోతాడు. ఈరోజు భగవంతుడితో పెట్టుకున్నాడు. కేవలం 23 సీట్లకు పరిమితం అయ్యాడు. రేపు మళ్లీ దేవుడు సరైన శిక్ష వేస్తాడు.

9. రామతీర్థంలో విగ్రహాల కోసం రూ.లక్షా నూటపదహార్లు అశోకగజపతిరాజు పంపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విగ్రహాలను ఉచితంగా ఇచ్చిందని ఆ చెక్‌ను రిటర్న్‌ చేస్తే.. విపరీతంగా మాట్లాడుతున్నారు. రామతీర్థం ఆలయానికి చెక్‌ పంపించిన వ్యక్తి విగ్రహం కోసమే అని కండీషన్ పెట్టడం ఎందుకు? ఆ విగ్రహాలు టీటీడీ నుంచి ఉచితంగా వచ్చాయి కాబట్టి చెక్‌ ను రిటర్న్‌ చేశారు. విగ్రహాలకు కాదు రామతీర్థం దేవాలయానికి అంటే.. లక్ష కాదు కోటి ఇచ్చినా తీసుకుంటాం. అంతే తప్ప మీరు కావాలని అపవాదులు వేయవద్దు. టీటీడీ విగ్రహాలు చేస్తున్న సంగతి రాష్ట్రమంతా తెల్సు. అది తెల్సుకొని చెక్‌ పంపించారు. ఇది కూడా మొసలి కన్నీరే. విగ్రహం అని రాయకపోతే.. టెంపుల్ ఖాతాలో జమ చేసేవాళ్లం. అక్కడ ఉన్న అసిస్టెంట్ కమిషనర్‌ రిప్లై కూడా పంపించారు. మీరు విగ్రహాలకు అన్నారు కాబట్టి విగ్రహాలు టీటీడీ ఉచితంగా ఇస్తోందని అసిస్టెంట్ కమిషనర్‌ ప్రత్యుత్తరం రాసి పంపించారు. దీనిపై ప్రజల్ని మభ్యపెట్టాలని, తప్పుదోవ పట్టించాలని అశోకగజపతిరాజు మా చెక్‌ రిటర్న్ చేశారనటం చెప్పటం సరికాదు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలను, హిందువుల్ని అన్ని రకాలుగా కాపాడే ప్రభుత్వం మాది.

*మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…*

– అంతర్వేది ఘటనపై సీబీఐకి అప్పజెబుతూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. దానిపై జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభలో మాట్లాడితే బావుండేది. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవటం లేదు. సీబీఐ విచారణకు వచ్చేలోపే నూతన రథం నిర్మించాం. శ్రీ జగన్ గారి పనివిధానం ఆ విధంగా ఉంటుంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని ఫిబ్రవరి 26న స్వామి వారి రథోత్సవం ఉందని వేగంగా రథాన్ని తయారు చేశాం.

About The Author