జల్సాల కోసం హత్య చేసిన నిందితుడి అరెస్టు.


పాలకుర్తి మండలం రాఘవపురం బస్టాప్ వద్ద జరిగిన హత్యకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిని పాలకుర్తి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి నుండి ఒక కారు, నాలుగు ద్విచక్రవాహనాలు, రెండు సెల్ ఫోన్లు మరియు రెండు పెప్పర్ స్పెరే బాటిళ్ళలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించిన వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ. పి. ప్రమోద్ కుమార్ ఐ పి యస్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ఈ హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యులు లేకున్న పాలకుర్తి పోలీసులతో పాటు ఐటీకోర్ విభాగం, సైబర్ క్రైం పోలీసులు అధునిక పద్ధతులతో ప్రస్తుతం పోలీసుల వద్ద అందుబాటులో వున్న టెక్నాలజీ వినియోగించుకోవడంతో పాటు సిసి కెమెరాల్లో నమోదయిన దృష్యాల ఆధారంగా హత్యకు పాల్పడిన నిందితుడుని పోలీసులు గుర్తించి అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డి.సి.పి శ్రీనివాస్ రెడ్డి, వర్ణన్నపేట ఎ.సి.పి రమేష్, పాలకుర్తి ఇన్ స్పెక్టర్ చేరాలు, ఐటీ మరియు సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్లు రాఘవేందర్, జనార్ధన్ రెడ్డి, పాలకుర్తి ఎస్.ఐ సతీష్, దేవరుప్పుల, కొడకండ్ల ఎస్.ఐలు కరుణాకర్ రావు, పవన కుమార్తో పాటు పాలకుర్తి, సైబర్ క్రైం సిబ్బందిని పోలీసు కమిషనర్ గారు అభినందించారు.

About The Author