జూన్ 26 నుండి జూలై 3 వరకు, జరిగే 32వ… (International Seed Testing Association)

జూన్ 26 నుండి జూలై 3 వరకు , హైదరాబాద్ లోని HICC లో జరిగే 32వ ఇష్ట (International Seed Testing Association) సమావేశాలను పకడ్భందీగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె జోషి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ISTA Congress నిర్వహణపై ముందస్తు ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో Dr.Andreas Wais, ISTA Secretary General, Mrs. Olga Stoekii, ISTA, Switzerland , ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ పీటర్ కార్ బెర్రీ (Peter Carberry) , వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారథి, టూరిజం శాఖ కార్యదర్శి బి.వెంకటేశం , హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ , అదనపు డి.జి. జితేందర్ , వ్యవసాయ శాఖ కమీషనర్ రాహుల్ బొజ్జా, రీజినల్ పాస్ పోర్టు ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి, కేశవులు , సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ , సమాచార శాఖ చీఫ్ ఇన్ ఫర్ మేషన్ ఇంజనీర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముందుగా International Seed Exhibition పై రూపొందించిన బ్రోచర్ ను ప్రధాన కార్యదర్శి ఆవిష్కరించారు.జూన్ 26న ప్రారంభోత్సవ కార్యక్రమం, 26 నుండి 28 వరకు Seed Symposium, International Seed Exhibition, 28న విత్తన వ్యవసాయ దారుల సమావేశం , జూన్ 29 నుండి జూలై 3 వరకు ISTA వార్షిక సమావేశాలు జరుగుతాయని , దాదాపు 400 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటారని , వీరికి వసతి, బద్రత, రవాణా సదుపాయాలు కల్పించాలని ప్రధాన కార్యదర్శి అన్నారు. విత్తన ప్రదర్శనలో ప్రపంచం లోని వివిధ ప్రాంతాల నుండి 200 విత్తన కంపనీలు పాల్గొంటాయని, కొత్త ఉత్పత్తులు ,సీడ్ ప్రాసెసింగ్ , ప్యాకింగ్ ఎక్విప్ మెంట్స్ , సీడ్ ట్రీట్ మెంట్ , నూతన టెక్నాలజి పై వుంటుందని సి.యస్ అన్నారు. విత్తన ఉత్పత్తి , నాణ్యతపై ఈ సింపోజియం ఉంటుందన్నారు. ఈ సింపోజియం లో అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి 50 మంది చిన్న , మధ్య తరహా ఎంటర్ ప్రైజెస్ నుండి పాల్గొంటారని అన్నారు. ఎఫ్.ఎ.ఓ (Food and Agriculture Organization- FAO) సహకారం తో జరుగుతుందని అన్నారు. రైతులకు విత్తనాల ఉత్పత్తి లో అమలవుతున్న నూతన పద్దతులు , నాణ్యతపై అవగాహన కల్పించడానికి ఈ సమావేశాలు జరుగుతాయన్నారు.ఈ సందర్భంగా భారతీయ , తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ISTA Congress కు తగు ప్రచారాన్ని నిర్వహించాలని ఆదేశించారు. విదేశీ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను సందర్శించే ప్యాకేజి వివరాలను ముందుగానే వారికి తెలియచేయాలని అన్నారు.

About The Author