ఎల్ఈడి టీవీ లో మృతిచెందిన పాము…
గిద్దలూరు లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఎల్ ఈ డి టీవీ లో పాము మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
దిగువమెట్ట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఎల్ఈడి టీవీ చెడిపోవడంతో టీవీని రిపేర్ చేయించుకునేందుకు గిద్దలూరు కు తీసుకుని వచ్చాడు.
మెకానిక్ టీవీ రిపేర్ చేసేందుకు టీవీ విప్పి పరిశీలించాడు దాంతో మెకానిక్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఖంగు తిన్నాడు.
టీవీ లో పాము దూరటం వల్ల విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది అని, దీనివల్ల టివి లో సాంకేతిక లోపం తలెత్తింది చెడిపోయిందని గుర్తించాడు.
ఈ తంతు అంతా చూసినా నా టీవీ యజమాని ఒక్కసారిగా కంగు తిని ఎల్ఈడి టీవీ లో ఎలా వెళ్ళిందో అర్థం కావడం లేదని అయోమయంలో పడ్డాడు.