మల్టీ గ్రైన్. మల్టీ పర్పస్ హెల్దీ “అడై దోశ’


రెసిపి:
బియ్యం, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్ప, మినప్పప్పు….వగైరా….ఓ “గుప్పెడు” చొప్పున…
మూడు/నాలుగు ఎండు మీర్ఛీ, ఓ చెంచా చొప్పున – జీలకర్ర, మిరియాలు,
అల్లం ముక్క, రెండు/మూడు పచ్చిమిర్చి…
పైవన్నీ……రెండు/మూడు గంటలు నీళ్ళలో ..నానబెట్టి…..మిక్సీలో….95% గ్రైండ్ చేయాలి. రుబ్బిన పిండి…దోశలు వేసేంత అనువుగా ఉండాలి. తగినంత ఉప్పు కలపాలి.మరీ గట్టిగా నూ….రమణారెడ్డి గారిలా మరీ ‘పలుచగా’ ఉండకూడదు. అలా తయారైన పిండిని….ఓ పది/పదిహేను నిమిషాలు అలానే ఉంచండి.
ఈ టైమ్ లో అడై దోశల కోసం…కొబ్బరి పచ్చడి చేయండి. (ఇడ్లీ/దోశల కోసం చేసే విధంగానే)
అడై దోశలు….కొద్ది మందంగా…ఊతప్పాల కంటే కొద్దిగా పలుచగా….వేసుకుంటే….”బెస్టాది…’బెస్ట్’ గా ఉంటాయి”
సర్వ్ చేసేముందు…..మీకిష్టమైతే “అమూల్ బటర్” తో “అడై దోశ” ను డెకరేట్ చేయండి.

About The Author