మోడల్స్, నటీ, నటులతో పోర్న్ వీడియోలు
ఔత్సాహిక నటీ, నటులు, మోడల్స్‌తో పోర్న్ వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియా, ఇతర వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… ముంబై, మలద్‌లోని మల్వానీ ఏరియాలోని ఓ బంగ్లాలో పోర్న వీడియో చిత్రీకరణ జరుగుతోందని శుక్రవారం క్రైం బ్రాంచ్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సదరు బంగ్లాపై పోలీసులు రైడ్ చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నటులు, ఓ లైట్ మ్యాన్, మహిళా ఫొటోగ్రాఫర్, గ్రాఫిక్ డిజైనర్ ఇందులో ఉన్నారు. ఈ పోర్న్ వీడియో రాకెట్ నుంచి ఓ మహిళను సంరక్షించారు. నిందితులు మొబైల్ ఫోన్ల ద్వారా వీడియోలు తీస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే 6 మొబైల్ ఫోన్లు, ఒక లాప్‌ట్యాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై ఇన్‌స్పెక్టర్ కేదారి పవార్ మాట్లాడుతూ.. ‘‘ ఔత్సాహిక నటీ,నటులు, మోడల్స్ ఈ పోర్న్ వీడియో రాకెట్ గ్రూపు టార్గెట్. సినిమాలు, ఓటీటీ సిరీస్‌లలో అవకాశం ఇస్తామని అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు. షరతులేవీ చెప్పకుండా వారితో అగ్రిమెంట్ చేయించుకుని బలవంతంగా పోర్న్ వీడియోలలో నటించేలా చేస్తున్నారు. ఆ వీడియోలను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. పోర్న్ వీడియోల ద్వారా నిందితులు రెండేళ్లలో 37 లక్షల రూపాయలు సంపాదించారు’’ అని తెలిపారు.