న‌టిపై చీటింగ్ కేసు…


గ్లామ‌ర్ రంగానికి చెందిన వారికి సంబంధించి ప్ర‌తి చిన్న విష‌యం కూడా విస్తృత ప్ర‌చారానికి నోచుకుంటుంది. ఎందుకంటే ఆ రంగానికి ఉన్న ఆక‌ర్ష‌ణ అలాంటిది. వ్య‌క్తుల కంటే సినీ రంగం ఎంతో ప‌వ‌ర్ ఫుల్‌.
అందుకే సినీ రంగంలో చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా, పే…ద్ద ప్ర‌చారానికి నోచుకుంటుంది. తాజాగా బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్‌పై చీటింగ్ కేసు న‌మోదు కావ‌డం విస్తృత ప్ర‌చారానికి నోచుకుంది.
2019లో కేర‌ళ‌లోని కొచ్చిలో జ‌రిగిన వేలంటైన్స్ డే ఫంక్ష‌న్‌లో పాల్గొంటాన‌ని రూ.29 ల‌క్ష‌లు తీసుకున్నార‌ని, ఆ త‌ర్వాత ఆమె రాలేద‌ని ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేర‌కు కేర‌ళ పోలీసులు సన్నీ లియోన్‌పై చీటింగ్ కేసు న‌మోదు చేశారు.
ఆమె వాంగ్మూలాన్ని కొచ్చి బ్రాంచ్‌ క్రైమ్ పోలీసు అధికారులు రికార్డు చేశారు. అయితే సన్నీ లియోన్ వాద‌న మాత్రం భిన్నంగా ఉంది. తానెవ‌రినీ మోసం చేయ‌లేద‌ని ఆమె చెప్పుకొచ్చారు.
తాను రెండు సార్లు కొచ్చి వెళ్లాన‌ని, వారే కార్యక్రమాన్ని నిర్వహించలేదని ఆరోపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. పైగా తనకు ఇంకా రూ. 12 లక్షలు వారే చెల్లించాల్సి ఉందని స‌న్నీ లియోన్ ఎదురు దాడికి దిగారు. ఈ నేప‌థ్యంలో పూర్తి వివ‌రాల‌ను ప‌రిశీలించి ఎవ‌రి వాద‌న నిజ‌మో నిగ్గు తేలుస్తామ‌ని పోలీసులు చెబుతున్నారు.

About The Author