విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై పునరాలోచించండి….
విశాఖ స్టీల్ ప్లాంటు స్థాపించిన నాటినుండీ నేటివరకూ ఇనుప ఖనిజ గనులు కేటాయించకపోవడం భాధాకరం.
దానివలన అధిక ధర చెల్లించి విదేశాలనుండీ దిగుమతి చేసుకోవలసి రావడంతో తీవ్ర నష్టాలను చవిచూడవలసి వస్తోంది.
ఒకప్పుడు చత్తీస్ఘడ్ లోని కిరండోల్ నుండీ ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంటుకు తెచ్చేవారు. అయితే ఇప్పుడు అక్కడ మరో స్టీల్ ప్లాంట్ కట్టడంతో ఐరన్ ఓర్ ను విశాఖకు తరలించడం ఆగిపోయింది.
కనీసం ఇప్పుడైనా విశాఖ స్టీల్ ప్లాంటుకు దేశంలో ఎక్కడైనా ఇనుప గనులను కేటాయించి ప్రయివేటీకరణను ఆపితే బాగుంటుంది.
ఇప్పటికే రాష్ట్రవిభజనతో హైదరాబాదుతో ఉన్న బలమైన అనుబంధాన్ని బలవంతంగా తెంచేయగా….ఇప్పుడు ఆంధ్రా భ్యాంకు అనే పదం లేకుండా పోవడం ఆంధ్రా ప్రజలకు కొంత సెంటిమెంట్ దెబ్బతిన్నదనే చెప్పాలి.
విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రయివేటీకరించడం మరింత బాధ కలిగించే అంశమే…..
పరిశ్రమ నష్టాలను భర్తీ చేసుకోవాలంటే గనులను కేటాయించడమొక్కటే పరిష్కారం.
భాజపా మీద AP ప్రజల్లో సానుకూల వాతావరణం వస్తున్న సమయంలో ప్రయివేటీకరణ నిర్ణయంతో తీవ్ర విఘాతం కలుగుతుందనేది వాస్తవం.
దయచేసి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని నా వ్యక్తిగత అభిప్రాయం.