ఎర్రకోటపై దాడి పక్కా ప్రణాళికతోనే జరిగింది. దీప్ సిద్దూ


ఢిల్లీ: రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఇండియా గేట్ వద్ద జరిగిన దాడి పక్కా ప్రణాళికతోనే చేసినట్లు తెలుస్తోంది.
భారత గేట్ వద్ద కనీసం ఉద్రిక్తతను సృష్టించ లేకపోతే,
ఎర్రకోటపై ఖచ్చితంగా దాడి చేయాలని దీప్ సిద్ధు తన అనుచరులకు సూచించినట్లు పక్కా ఆధారాలతో
అంతర్జాతీయ మీడియా ప్రచురించింది.

కరోనా లాక్డౌన్ సమయంలో ఇంటివద్ద నుంచే ఆఫీస్ పని చేస్తున్న దీప్ సిద్దూ, ఆ సమయంలో రైతుల దీక్షలో నిరసనలు ఎలా చేయ్యాలి, విద్వాంసం ఎలా సృష్టించాలొ పక్కా ప్రణాళిక రచించి వాటిని ఎలా అమలుపరచాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు విచారణలో తెలిసింది. దీప్ సిద్దూ ర్యాలీలోకి వచ్చిన సమయంలోనే, చాలా మంది యువకులు వచ్చి నిరసనలో చేరినట్లు తెలుస్తుంది. రిపబ్లిక్ దినోత్సవానికి ముందే దాడికి ప్రణాళిక రచించినట్లు తెలియవచ్చింది.
ట్రాక్టర్ ర్యాలీకి అనుమతించిన మార్గాన్ని ఉల్లంఘించి దాడి చెయ్యాలనేది కూడా ఇతని ప్రణాళిక లో భాగమే.
ఆ దాడిలో భాగంగానే వాలేంటీర్లకు ఇచ్చిన జాకెట్లు దొంగిలించి తన అనుచరులకు ఇచ్చినట్లు విచారణలో తెలుస్తుంది.

ఎర్రకోట వద్ద ఖలిస్తాన్ వేర్పాటు వాదుల జెండాని ఎగరేసింది
జుగ్రాజ్ సింగ్ అని పోలీసులు విచారణలో తేలింది.
ఇందుకోసం అతనిని ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి తీసుకువచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పంజాబ్‌లోని తరణ్ తరణ్‌కు చెందిన జుగ్రాజ్ ఇంతకు ముందు గురుద్వారాల్లో వద్ద కూడా ఖలిస్తాన్ జెండాలు ఎగరేసినట్లు విచారణలో తెలిసింది.

About The Author