భక్తులకు శుభవార్త… తిరుమలలో శ్రీవారి దర్శనంతో టూర్ ప్యాకేజీ
ఉదయాన్నే తిరుపతిలో రైలు దిగి మధ్యాహ్నానికి తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని సాయంత్రానికి తిరుపతి నుంచి తిరుగుప్రయాణం కావాలనుకుంటున్నారా? మీకోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది.
తిరుపతి వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఒకరోజు తిరుపతి టూర్ ప్యాకేజీ ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. తిరుమల వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తుంది ఐఆర్‌సీటీసీ. డివైన్ బాలాజీ దర్శన్ పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇది ఒక రోజు టూర్ ప్యాకేజీ మాత్రమే. ఇందులో వసతి సౌకర్యాలు ఉండవు. ఈ ప్యాకేజీలో తిరుమల, తిరుచానూర్ ఆలయాలు మాత్రమే కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.990 మాత్రమే. ప్యాకేజీలో ఏసీ బస్సులో ప్రయాణం, తిరుమల, తిరుచానూర్ ఆలయాల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది.
ఇది కేవలం ఒకరోజు టూర్ ప్యాకేజీ మాత్రమే. ఉదయం 8 గంటల్లోపు రైలు ద్వారా తిరుపతి చేరుకునే భక్తులు, ఒకరోజులోనే దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వెళ్లాలనుకుంటే వారికి ఈ ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుంది. భక్తులు తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకెళ్లాలి. ఐడీ కార్డు లేకపోతే టీటీడీ అధికారులు దర్శనానికి అనుమతించరు
https://www.irctctourism.com/pacakage_description…