భారత్ దేశాన్ని రేపిస్తాన్ అన్న జమ్ముకాశ్మీర్ కలెక్టర్….
భారత్ దేశాన్ని రేపిస్తాన్ అన్న జమ్ముకాశ్మీర్ కలెక్టర్….
అతడో బాధ్యత గల ఐఏఎస్ ఆఫీసర్.. కానీ భారత్ ను రేపిస్తాన్ అంటూ ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. అతడి పేరు షా ఫైజల్. బుధవారం నాడు అతడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపాడు. తన సోషల్ మీడియా అకౌంట్లలో ఆ విషయాన్ని స్పష్టం చేశాడు ఫైజల్. అతడు నేషనల్ కాన్ఫరెన్స్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరిన్ని విషయాలు శుక్రవారం నాడు బయటపెట్టనున్నాడు.
2009లో ఫైజల్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో టాపర్ గా నిలిచాడు. అంతేకాకుండా అతడికి సొంత రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ లోనే ఉద్యోగాన్ని ఇచ్చారు. అతడి తండ్రి టెర్రరిస్టుల చేతిలోనే చనిపోయాడు. డాక్టర్ చదివి.. యు.పి.ఎస్.సి.లో టాపర్ గా నిలిచిన జమ్మూ ప్రాంత వ్యక్తి అని అప్పట్లో మీడియాలో ఫైజల్ పేరు మారు మ్రోగి పోయింది. జమ్మూ కాశ్మీర్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత ఉన్నత విద్యల కోసం లీవ్ తీసుకున్నాడు. అతడు జూన్ లో విధుల్లో చేరవలసి ఉండగా.. రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
షా ఫైజల్ గతంలో ఎన్నో సార్లు హిందుత్వ వాదులను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. తాను వారిని ఎదిరించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు ఫైజల్. ఒమర్ అబ్దుల్లా కూడా అతడికి సపోర్ట్ గా ఉన్నారట. ఇతడు భారత్ ను రేపిస్తాన్ అన్నాడు.. దీంతో ఫైజల్ పై ఎంక్వయిరీ వేశారు. అతడు గత కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ వస్తున్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సానుభూతిపరుడిగా అతడికి పేరుంది.