అంగనవాడీ స్కూల్ లో కలెక్టర్ కూతురు…

అంగనవాడీ స్కూల్ లో కలెక్టర్ కూతురు…

చిన్నపిల్లలను స్కూలుకు వెళ్లే ఏజ్ వచ్చే వరకు…స్కూలు వాతావరణం అలవాటు అయ్యేందుకు అంగన్ వాడీలకు పంపేవారు తల్లిదండ్రులు. పట్టణాలు సమీపంలో లేకపోవడం లేదంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారు మాత్రమే తమ పిల్లల్ని అంగన్ వాడీల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో అంగన్‌ వాడీలు, ప్రభుత్వ స్కూళ్లు బోసిపోయి కనిపిస్తుంటాయి. కొంతమంది తప్ప… ప్రస్తుతం అంతా వారి పిల్లలను ప్లే స్కూళ్లలో, ప్రైవేట్ స్కూళ్లలో జాయిన్ చేయిస్తున్నారు. వేలంలో ఫీజులు వసూలు చేస్తున్నా… ఆ స్కూళ్లకే పంపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పేరెంట్స్.
తమిళనాడుకు చెందిన ఓ కలెక్టర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించి తన కూతురిని అంగన్‌ వాడీలో చేర్పించారు.తిరునల్ వెలి జిల్లా కలెక్టర్ గా శిల్పా ప్రభాకర్ సతీష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తన చిన్నారిని ప్లేస్కూల్ కు పంపించకుండా పలయంకొట్టాయ్ అంగన్‌ వాడీలో చేర్పించారు. అంగన్‌ వాడీలో తన కూతురు తమిళ్ నేర్చుకుంటుండటం సంతోషంగా ఉందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలతో తన కూతురు కలిసిపోవాలని… వారి నుంచి ఎంతో నేర్చుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అన్ని వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక స్థోమతగా అంతగాలేని నిరుపేదల పిల్లలే అంగన్‌ వాడీల్లో చదువుతారనే భావనను తొలిగించేందుకు కలెక్టర్ శిల్ప చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

మనకి రోజు గడవడానికి డబ్బులు ఉన్నా లేకపోయినా…పిల్లలను మాత్రం మంచి పాఠశాలల్లో చదివించాలని అనుకుంటాము. పెద్దవారైనా ఎంతో కష్టపడి…ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలని పంపించకుండా…భారీ ఫీజుల భారం మోస్తూ ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు. అలాంటి కలెక్టర్ పదవిలో నుండి తన కూతురుని అంగన్వాడిలో చేర్పించి హ్యాట్సాఫ్ అనిపించుకున్నారు తమిళనాడులోని ఓ మహిళా కలెక్టర్. వివరాలలోకి వెళ్తే..

శిల్పా ప్రభాకర్‌ సతీష్‌ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.తన కుమార్తెను అందరిలానే ప్రైవేట్‌ ప్లే స్కూల్‌కు పంపించకుండా తన ఇంటికి సమీపంలోని అంగన్‌వాడి కేంద్రానికి పంపిస్తున్నారు. ఈ విషయం గురించి శిల్ప మాట్లాడుతూ.. ‘నా కూతురు నలుగురితో కలిసిమెలసి ఉండాలని భావిస్తున్నాను. ఈ ఆర్థిక, సామాజిక బేధాలు తనపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ చేర్చాను. ఇవేకాక తాను చాలా త్వరగా తమిళం నేర్చుకోవాలని భావించి ఇక్కడకు పంపుతున్నాను’ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలంటే ప్రజల్లో ఉన్న చిన్నచూపును తొలగించడానికి ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడి బళ్లు కూడా శుభ్రంగానే ఉంటున్నాయని, పిల్లలను పంపాలని ఆమె చెబుతున్నారు. ‘నా బిడ్డ కూడా అందరి పిల్లల్లాంటిదే. అందరితో కలిసిమెలసి ఉండాలని అంగన్‌వాడి సెంటర్‌కు పంపుతున్నాను. నర్సరీ స్కూళ్లలో మాదిరే అక్కడా అన్ని సదుపాయాలూ ఉన్నాయి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలను ఆడిస్తారు, చదివిస్తారు. అంగన్‌వాడి సెంటర్లను మరింత అభివృద్ధి చేయాలి’

About The Author