గ్రామస్థులతో ముచ్చటించిన ఆర్థిక మంత్రి శ్రీ హరీశ్ రావు.


సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కర్సిగుత్తిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవానికి వెళ్లే సందర్భంగా తెలంగాణ – కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లా బీదర్ లోని ఓ గ్రామం వద్ద ఆగి గ్రామస్థులతో ముచ్చటించిన ఆర్థిక మంత్రి శ్రీ హరీశ్ రావు.

తాగు, సాగు నీరు, విద్యుత్, రైతులకు అందుతున్న సాయంపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్న మంత్రి శ్రీ హరీశ్ రావు.

రోడ్ మీదుగా వెళ్లతుండగా కనిపించిన గ్రామస్థులతో సంబాషణ.

మంత్రి. – అమ్మా బాగున్నారా… ఎలా ఉన్నారు‌ . మీది ఏ గ్రామం.

మహిళలు. – మాది కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ‌జాంబిగ గ్రామంలోని గామ తండా వాసులం.

మంత్రి- మీకు పెన్షన్స్ ఇస్తోందా మీ ప్రభుత్వం ఎంత ఇస్తున్నారు.

మహిళలు – మా ప్రభుత్వం ఐదువందల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు‌.

మంత్రి – తెలంగాణ రాష్ట్రంలోని మీ పక్కనే ఉన్న నారాయణఖేడ్ లో పెన్షన్ ఎంత ఇస్తున్నారో తెలుసా.

మహిళలు- మా వాళ్లు అక్కడ ఉన్నారు సార్. రెండు వేల రూపాయలు ఇస్తున్నారు‌.

మంత్రి – విద్యుత్ ఎంత సేపు ఇస్తున్నారు.

రైతు – ఐదారు గంటలు‌ కూడా‌ రావడం‌లేదు. కరెంట్ వస్తూ పోతూ ఉంటుంది. నా ఐదేకరాల పంటకు నీరు పారాలంటే పది రోజులు పడుతుంది‌‌ సార్.

మంత్రి – పక్కనే నారాయణ ఖేడ్ లో కరెంటు ఎలా ఉంది.

గ్రామస్థులు- సార్ పక్కనే తెలంగాణ గ్రామాలు మాకు కనిపిస్తనే ఉంటుంది. 24 గంటలు కరెంట్ వస్తోంది. మేం చూస్తూనే ఉన్నాం. మా బాధలు‌ తెలుసుకునే వారే లేరు.

మంత్రి – అమ్మా ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ సందర్భంగా ప్రభుత్వ‌సాయం ఏమైనా అందుతుందా..

మహిళలు‌ – మాకేమీ ఇవ్వడం‌లేదు.

మంత్రి- మేం డెలివరీ ‌సందర్భంగా కేసీఆర్ ‌కిట్ అందజేస్తున్నాం.

మహిళలు- మీదగ్గర అన్నీ బాగా చేస్తున్నరు సార్.

మంత్రి – పెళ్లికి ఏమైనా సాయం చేస్తున్నరా..

మహిళలు- లేదు సార్ ఏదీ సాయం అందడం లేదు.

మంత్రి- నారాయణ ఖేడే లో పెళ్లికి సాయం అందుతుందా..

మహిళలు- మాకు తెలుసు‌సార్ , మా వాళ్లు ఉన్నారు. పెళ్లికి లక్ష రూపాయల సాయం అందుతోంది.

మంత్రి – మంచి నీటి సౌకర్యం అందుతుందా.. ? ఇంటింటికి తాగు నీరు ఇస్తున్నారా. ?

మహిళలు – కిలో మీటర్ దూరం నుండి ఇక్కడకు వచ్చి నీళ్లు పట్టుకుంటాం సర్. కరెంట్ వస్తే బిందలతో నీళ్లు తెచ్చుకుంటాం.

మంత్రి – వ్వవసాయానికి మీ ప్రభుత్వం సాయం చేస్తుందా. ?

రైతు- మాకు ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు‌.

మంత్రి- మేం‌ ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున, ఎన్ని ఎకరాలుంటే అన్ని ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం

About The Author