30 కోట్లు అతడికి వచ్చాయి అతడు ఆ 30 కోట్లూ దానం చేశాడు .


అతడే కల్యాణ సుందరం .
ఎవరికీ దానం చేశాడు ? ఎందుకు దానం చేశాడు ? 30 కట్లు ఎలా వచ్చాయి ?

తెలుసుకోవాలంటే ఇది పూర్తిగా చదవాలి
తమిళనాడు లో Melakaruvelangulam అనే గ్రామం లో పుట్టిన కల్యాణ సుందరం పుట్టిన సంవత్సరం లోపే తండ్రి చనిపోయారు . పేదరికం లోనే పెరిగారు ఆయన . స్వయం కృషితో బెచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ లో గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు . ఎం . ఎ ఇంగ్లీష్ లిటరేచర్ , ఎం . ఎ హిస్టరీ చేశారు . తరువాత టుటికోరన్ లో కుమార్ కరుప్ప కాలేజీ లో లైబ్రేరియన్ గా పని చేశారు . ఆ కాలం లో తనకు వచ్చే జీతం 140 రూపాయలలో 40 రూపాయలు స్వంత ఖర్చులకు , 100 రూపాయలు పేద పిల్లల చదువులకూ ఖర్చు చేసేవారు . తాను 27 సంవత్సరాలు రైల్వే స్టేషన్ లోనే పడుకునే వారు .

ఒక దశలో ఆయన తన మొత్తం జీతాన్ని పేద విద్యార్దులకోసం ఖర్చు పెట్టడం మొదలు పెట్టారు . అపుడు తన కోసం హోటల్ లో సప్లయరు గా పనిచేసేవారు . తనకు వచ్చిన జీతాల ఎరియరు లక్ష రూపాయలు , పల్లెటూరులో తన ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బు తనకు ఇష్టమైన ఈ పెదవిద్యార్దుల కోసం ఖర్చు పెట్టేవారు . వారికోసం ఆయన తన రిటైర్మెంట్ డబ్బు మొత్తం పెట్టి ఒక స్వచ్చంద సంస్థను 1998 లో స్థాపించారు . దానిపేరు ” పాలం ” ( తమిళ పేరు )

పాలం దాతలనూ , లబ్దిదారులనూ అనుసంధానం చేస్తుంది . పేద విద్యార్ధులను ఉన్నత విద్యావంతులను చేస్తుంది . ధనం సేకరించడమే కాదు , అవుసరమైన వారికి ఏదైనా చేస్తుంది . పిల్లల చదువు , అవుసరమైన వారికీ వైద్య సహాయం , బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆర్గనైజేషన్ , ముసలివారికి ఆశ్రయం , ప్రకృతి వైపరిత్యాల్లో సహాయపడటం , ఉచిత కౌన్సిలింగ్ , —— అందుకే ఆయన పాలం కల్యాణ సుందరం

ఆయన సంపాదించిన అవార్డులు :

ప్రపంచ గొప్ప పదిమంది లైబ్రేరియన్స్ ( ‘one of the top ten librarians of the world’)

భారత ప్రభుత్వం చే ‘The Best Librarian in India’

ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ కేంబ్రిడ్జి …. వారిచే ‘one of the noblest of the world’ అవార్డు

20 వ శతాబ్దపు అతి గొప్ప వ్యక్తిగా ఐక్యరాజ్య సమితి చే గుర్తింపు

దీనితర్వాత ఒక అమెరికన్ సంస్థ ఆయనను ” మాన్ అఫ్ ది మిలీనియం” అవార్డు తో పాటు 30 కోట్ల రూపాయలు ఇచ్చింది .

ఆ 30 కోట్లూ ఆయన పాలం సంస్థకు ఇచ్చేశారు .

ఆయన మాటలు :

నేను బ్రహ్మచారిని . నాకు స్వంతం గా ఏదీ అక్కరలేదు . ఇక్కడనుండి వెళ్ళేటపుడు కూడా మనం ఏమి తీసుకు వెళ్ళగలం ? నా జీవితం లో అత్యంత సంతోషకరమైన ఘటన ఈ 30 కోట్లు
” పాలం ” కు సమకూర్చడం .
కొస మెరుపు :
ఈయన విషం తెలుసుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈయనను తన ” దత్తత తండ్రి ” గా తీసుకున్నారు .

About The Author