అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు.


“అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు.” జబర్దస్త్ ఫేమ్ అనసూయ లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఈసారి ఇలా బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు ఏ ఒక్కరికో చెందినవి కావు. అనసూయ చేసిన ఓ ఐటెంసాంగ్ లో లిరిక్స్ ఇవి. ఇప్పుడు మేటర్ లోకి వెళ్దాం.
అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ‌బన్నీ వాసు నిర్మాత‌గా కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ఈ సినిమాలో అనసూయ ఓ మాస్ మ‌సాలా ఐట‌మ్ సాంగ్ లో చిందేసింది.
అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్ తో సాగే ఈ పాట‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయబోతున్నారు. ఈ పాటకు సంబంధించిన లిరిక్స్ ఇవి. మేకర్స్ ఆ లిరిక్స్ ను చెప్పలేదు. అనసూయ మాత్రం బయటకు చెప్పేసింది.
‌హీరో కార్తికేయ ఈ సినిమాలో బస్తీ బాలరాజు పాత్రలో, మార్చురీ వ్యాన్ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. లావణ్య త్రిపాఠి హాస్పిటల్ లో నర్స్ గా కనిపించనుంది. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ మార్చి 19న థియేటర్లలోకి రానుంది.

About The Author