ఒక లక్షా పదివేల మంది….క్రికెట్ స్టేడియం.
ఒక లక్షా పదివేల మంది….భారతమాతాకీ జై
అంటే ఎలా ఉంటుందో..ఊహించండి. ఈ ఊహ నిజమే
మొతేరా (గుజరాత్) లో..త్వరలో నిర్మాణం పూర్తి చేసుకోబోతున్న… క్రికెట్ స్టేడియం.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రేలియా లోని ఎంసీజీ అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ స్టేడియం కెపాసిటీ లక్షకు పైగానే..! ఇంతకు ముందు మన ఈడెన్ గార్డెన్స్ కు కూడా ఆ పేరు ఉండేది కానీ.. ఆ తర్వాత 66000కు కుదించేశారు. అయితే మరోసారి అతిపెద్ద క్రికెట్ స్టేడియంకు భారత్ నాంది పలికింది. లక్ష పదివేల మంది సీటింగ్ కెపాసిటీ ఉండబోతోంది అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియం.. దీన్నే మొతెరా స్టేడియం అని కూడా అంటారు. ఇదే గ్రౌండ్ లో గతంలో భారత లెజెండ్లు పలు రికార్డులను నెలకొల్పారు. సునీల్ గవాస్కర్ 10000 పరుగుల టెస్టు రన్స్ ను సాధించింది.. కపిల్ దేవ్ 431 టెస్టు వికెట్లు తీసింది ఈ మైదానం లోనే..! 1999లో సచిన్ తన మొదటి డబుల్ సెంచరీని ఇక్కడే అందుకున్నాడు.
మొతెరా స్టేడియాన్నే పూర్తిగా మార్చేసి ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రూపుదిద్దనున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమల్ నథ్వానీ వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ఈ స్టేడియం ఫొటోలను కూడా తొలిసారి విడుదల చేశారు. ఎంసీజీ కంటే ఈ స్టేడియం పెద్దగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ స్టేడియం నిర్మాణం పూర్తయితే ఇది దేశ ప్రతిష్ఠను ఇనుమడిస్తుందని అన్నారు.
ఈ స్టేడియం సామర్థ్యం ఒక లక్ష 10 వేలకు పైగానే..! 2018 జనవరిలో ఈ గ్రౌండ్ రేఖలు మార్చాలని పూనుకున్నారు. ఎల్&టి కంపెనీ దీన్ని పూర్తీ చేయబోతోంది. 63 ఎకరాల్లో ఈ స్టేడియంను నిర్మిస్తుండగా.. 700 కోట్లు పైగా ఖర్చు చేస్తున్నారు. 3000 ఫోర్ వీలర్లకు, 10000కు పైగా టూ వీలర్లకు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ గ్రౌండ్ ను ఇంత భారీగా మార్చడానికి కారణం నరేంద్ర మోడీనే..! ఆయన హయాంలోనే ఫైళ్లు చకచకా కదిలాయి. ఇంత పెద్ద స్టేడియంలో ఒక్కసారిగా అందరూ కలిసి భారత్ మాతాకీ జై..! అంటే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి.