ఇది నా ప్రేమకథ – సింగర్ సునీత…


వయసులో ఉన్నోళ్లు ఎలాగైనా ప్రేమించుకుంటారు. వాళ్ల ముద్దు-ముచ్చట్లు ఎవరైనా ఊహించుకోవచ్చు. కానీ రెండో పెళ్లి చేసుకున్న సునీత-రామ్ ప్రేమకథ ఎలా మొదలైంది. ముందుగా రామ్ ప్రపోజ్ చేశాడా.. లేక సునీత ప్రపోజ్ చేసిందా..? దీనిపై ఈ భార్యాభర్తలిద్దరూ కామన్ గా స్పందించారు.
రామ్: పెళ్లిపై తనకు ఏడేళ్లుగా ఇండికేషన్ ఇస్తూనే ఉన్నాను. కానీ సునీత పట్టించుకోలేదు. ఫోన్ చేసిన ప్రతిసారి ”ఇంకేంటి” అని అడిగేవాడ్ని. సునీతకు అర్థమయ్యేది కాదు. కొన్నిసార్లు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేసేది కాదు. లాక్ డౌన్ లో మాత్రం కాస్త దగ్గరయ్యాం.
సునీత: నిజానికి మా మధ్య ప్రపోజల్స్ లేవు. ఓసారి ఇలానే ప్రొఫెషనల్ గా ఏదో మాట్లాడుతుండగా.. ”ఇంకేంటి” అని మళ్లీ అడిగాడు. ఏంటి ఇలానే సింగిల్ గా ఉంటావా అని అడిగాను. అప్పుడు రామ్ కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. నిజంగానే అడుగుతున్నావా లేక నటిస్తున్నావా అని అడిగాడు. కొన్నేళ్లుగా నేను ప్రపోజ్ చేస్తున్న సంగతి నీకు అర్థం కావట్లేదా అని క్వశ్చన్ చేశాడు.
అలా తామిద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చిందని రామ్-సునీత వెల్లడించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చాలాసార్లు అలా కారులో డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడుకున్నారు. పెళ్లిపై ఓ అభిప్రాయానికొచ్చారు.
అయితే నిశ్చితార్థం మాత్రం చాలా గమ్మత్తుగా జరిగిందని చెప్పుకొచ్చింది సునీత. నిజానికి వీళ్లు నిశ్చితార్థం కాన్సెప్ట్ అనుకోలేదంట. రామ్ ఫ్యామిలీ అంతా కలిసి తొలిసారి సునీత ఇంటికొచ్చి, ఆమెకు బట్టలు పెట్టారంట. ఆ ఫొటోలు అనుకోకుండా బయటకు రావడం, మీడియా దాన్ని నిశ్చితార్థంగా మార్చేయడం చకచకా జరిగిపోయాయని చెప్పుకొచ్చారు.

About The Author