కరోనా నిబంధనలు పాటించకుండా తరగతులు నిర్వహిస్తున్న నలంద పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి—- AIPSU.


ఆర్మూర్ పట్టణంలోని నలంద హై స్కూల్ నందు కరోనా నిబంధనలు పాటించకుండ విద్యార్థులకు సైతం మాస్కులు లేకుండా రెండో తరగతి గదులను ఒకే దగ్గర కూర్చుండబెట్టి కనీస సామాజిక దూరం పాటించకుండా తరగతులు నిర్వహిస్తున్న నలంద పాఠశాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం వినతి పత్రం జిల్లా విద్యాధికారి కి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల మాట్లాడుతూ ఇలాంటి సామాజిక దూరం పాటించకుండా రెండు తరగతుల ఒకే దగ్గర కూర్చుండబెట్టి విద్యార్థులకు మాస్కులు లేకుండా తరగతులు నిర్వహిస్తూ ఇదేంటని నిలదీసిన విద్యార్థి సంఘం నాయకులను వీడియోల తీయకుండా తలుపులు వేయడం అమానుషం కనీస విద్యార్హత లేకుండా పార్ట్ టైం టీచర్లతో విద్యాబోధన కొనసాగిస్తూ కనీసం విద్యార్థులకు పాఠ్యాంశాల అవగాహన కలిగేలా ఉండని బోధన ఏ రకంగా విద్యార్థులకు ఉపయోగపడుతుందని కేవలం ఫీజులు వస్తే చాలు అనుకునే విధంగా వీరు చర్యలు ఉన్నాయని అధికంగా ఫీజులు వసూలు చేస్తూ ఫీజులు చెల్లించని విద్యార్థులకు ఆన్లైన్లో లింకులు కూడా పంపకుండా వ్యవహరిస్తున్నారని వీరిపై వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం దీనిపై జిల్లా విద్యాధికారి స్పందిస్తూ రేపు మండల విద్యాధికారి పాఠశాల తనిఖీ పంపిస్తానని దానికి సంబంధించిన ఆధారాలు మండల విద్యాధికారి ఇవ్వాలని చెప్పడం జరిగింది అవసరమైతే తాను కూడా వెళ్ళి పాఠశాలను తనిఖీ నిర్వహిస్తాని డిఈఓ విద్యార్థి సంఘ నాయకులు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కిరణ్, జిల్లా నాయకులు శ్రీను, శ్రీనివాస్, విట్టల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు

About The Author