గ్రామంలో నెలకొన్న గొడవలే హత్యలకు కారణం…


హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణి హత్యకు సొంత గ్రామంలో నెలకొన్న గొడవలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు నిందితులు ఉపయోగించిన నల్లని బ్రీజా కారు పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుదని కొత్త ట్విస్ట్‌ ఇచ్చారు. గురువారం రాత్రి పెద్దపల్లిలో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ, డీఐజీ ప్రమోద్‌ కుమార్‌తో కలిసి వరంగల్‌ జోన్‌ ఐజీ వి.నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్, బిట్టు శ్రీను కారు డ్రైవర్‌ శివందుల చిరంజీవి కలిసి కొబ్బరికాయలు నరికే కత్తులతో ఈ హత్యాకాం డకు పాల్పడ్డారని తెలిపారు. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్‌ ఇంటి నిర్మాణాన్ని వామన్‌రావు అడ్డుకోవడం, ఊరిలో నిర్మిస్తున్న దేవాలయం పనులకు అభ్యంతరం తెలపడం, రామాలయ కమిటీ వివాదాల కార ణంగా హత్యలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వివరించారు.

About The Author