భారత దేశం స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యం దిశగా మరో ముందడుగు పడింది.
భారత దేశం స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యం దిశగా మరో ముందడుగు పడింది.
హెలికాప్టర్ లాంచ్‌డ్ నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ (హెలినా) శత్రువులపై ప్రతాపం చూపేందుకు సిద్ధమైంది.
రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో జరిగిన ప్రయోగ పరీక్షల్లో ఈ మిసైల్ నూటికి నూరు శాతం లక్ష్యాలను ఛేదించింది. దీంతో సాయుధ దళాల్లో ప్రవేశించేందుకు సిద్ధమైంది.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, హెలినాను గత ఐదు రోజుల్లో పరీక్షించారు.
నూటికి నూరు శాతం లక్ష్యాలను ఇది విజయవంతంగా ఛేదించింది.
దీని పరిధి ఏడు కిలోమీటర్లు. ఐదుసార్లు పరీక్షించగా ప్రతిసారీ విజయవంతంగా లక్ష్యాలను ఛేదించింది.
తుది పరీక్ష శుక్రవారం ఉదయం విజయవంతంగా పూర్తయింది.
దీంతో హెచ్ఏఎల్ రుద్ర, లైట్ కంబాట్ హెలికాప్టర్స్‌పై చేరేందుకు సిద్ధమైంది.
హెలినా మిసైల్ థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ వెపన్.
దీనిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దగ్గర ఉన్న హొంగ్జియాన్-8 సిస్టమ్‌తోనూ, పాకిస్థాన్‌లోని బీఏఆర్‌క్యూ లేజర్ గైడెడ్ మిసైల్‌తోనూ పోల్చవచ్చు.