పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు వైసీపీ నేతలు శ్రీవారి లడ్డూలు పంపిణీ
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు వైసీపీ నేతలు శ్రీవారి లడ్డూలు పంపిణీ చేయడంపై నారా లోకేష్ ధ్వజమెత్తారు.
‘చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ పంచాయతీలో వైసీపీ నేతలు పరమపవిత్రమైన శ్రీవారి లడ్డూలను ఓట్ల స్లిప్పులతో కలిపి పంచుతూ స్వామివారికి మహాపచారం తలపెట్టారు.
జగన్‌రెడ్డికి, వైసీపీ నేతలకు ఎన్నికలపైనే కానీ, ఏడుకొండలవాడిపై భక్తిలేదు.
సన్నాసుల సన్నబియ్యం వ్యాన్లలో లడ్డూలను తరలించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు.
ఎస్సీలకు 5 లడ్లు, ఇతరులకు 10 లెక్క పంపిణీ చేసి కులవివక్ష చూపారు.
ఓట్లకు కోట్లు వెదజల్లుతున్నా పల్లెల్లో జగన్‌రెడ్డిని జనం నమ్మడంలేదు.
శ్రీవారి లడ్డూలిస్తే భక్తితోనైనా ఓటేస్తారని వైసీపీ నేతలు పన్నిన కుతంత్రం ఇది.
హిందువులకు అత్యంత పవిత్రమైన లడ్డూలను ఓటర్లకు తాయిలాలుగా పంచిన అభ్యర్థిని పోటీకి అనర్హులుగా ప్రకటించాలి.
కొండపై భక్తులకు ఒక లడ్డూ దొరకని పరిస్థితిలో ఇన్ని వేల లడ్డూలు తరలించిన వైసీపీ నేతలు, వారికి అందించిన టీటీడీ యంత్రాంగంపై చర్యలు చేపట్టాలి.
స్వామికి జరిగిన అపచారం, వ్యాన్లలో తరలింపు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, కులవివక్షలపై కేసులు నమోదు చేసి నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.