రేవంత్ సభలో సూరీడు.. అసలు చర్చ ఏంటంటే…


సూరీడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారం ఉండరంటే అతిశయోక్తికాదు. ఎందుకంటే ఉమ్మడి ఏపీకీ దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డికి ఎల్లప్పుడు వెన్నంటి ఉండేవారు. ఆ విధంగా ఆయన్ను చూడని వారేవరూ లేరోమో! రాజశేఖర్‌రెడ్డికి అత్యంత విధేయుడుగా సూరీడుకు మంచి పేరుంది. వైఎస్‌ఆర్ సన్నిహితులైతే సూరీడు వైఎస్‌ఆర్ ఆత్మ అనేవారంటే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు._
_అంతకాదండవోయ్.._ _రాజశేఖర్‌రెడ్డికి మాత్రమే కాదు.. వైఎస్‌ఆర్ కుటుంబంతో కూడా కలిసిమెలిసి ఉండేవారని పులివెందుల వాసులు చెప్తుంటారు. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆయన వైఎస్ఆర్ మృతి చెందిన అనంతరం కనుమరుగైపోయారు. వైఎస్‌ఆర్ మరణం తర్వాత ఉమ్మడి ఏపీకి సీఎం కావాలని జగన్ చేసిన ప్రయత్నాలు అందరీకి సుపచరితే. ఆ ప్రయత్నాలు విఫలమై ఓ స్వంత పార్టీని స్థాపించారు. అయితే వైఎస్‌ఆర్‌తో అంత సన్నిహితంగా మెలిగిన సూరీడు వైసీపీలో చేరడం పక్కన పెడితే.. ఆ పార్టీ దరిదాపుల్లోకి కూడా వెల్లలేదని కడప జిల్లా వాసులు అంటుంటారు. అందుకు కారణం ఆయన కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు కాబట్టి వైసీపీలో చేరలేదని చెబుతున్నారు. అందువల్లే వైఎస్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారని పలువురు చెబుతున్నారు._
ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న సురీడు.. నిన్న రావిరాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంతేకాదు వేదిక మీదికి వచ్చి కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డిని స్వయంగా కలిసి ఫొటోలు కూడా దిగారు. ఇక ఇప్పుడే అసలైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే కొందరు రేవంత్‌రెడ్డిని రాజశేఖర్‌రెడ్డితో పొల్చుతున్నారు. ఎలాగంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతల్లో రేవంత్‌రెడ్డికి ఉన్న షరిష్మా మరే నేతకు లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ వల్ల తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వసించే నేతలు లేకపోలేదు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా అదే మార్గంలో వెళ్తున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. రేవంత్‌కు రాజశేఖర్‌రెడ్డికి మధ్య మరో పోలికను కూడా చేస్తున్నారు. ఎలాగంటే అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానంతో సంబంధం లేకుండా రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉంది._
రేవంత్‌రెడ్డి పాదయాత్రపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ పాదయాత్ర ముగింపు సభకు వెళ్లొద్దని సీనియర్ల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రేవంత్ పాదయాత్రకు హైకమాండ్ అనుమతి లేదని, అయితే తమ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర చేసుకోమని అధిష్ఠానం చెప్పిందని కాంగ్రెస్ నేతలు వాధించారు. రేవంత్‌రెడ్డి తన పార్లమెంట్ పరిధి కాకుండా… ఇతరుల నియోజకవర్గాల్లో ఎలా పాదయాత్ర చేస్తారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌ పాదయాత్ర ముగింపు సభకు రావొద్దని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఠాగూర్‌పై సీనియర్ల ఒత్తిడి తెచ్చారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అందుకే ప్రధాన నాయకత్వం ఈ సభకు రాలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. రాజశేఖర్‌రెడ్డి, రేవంత్‌ల మధ్య అనేక పోలికలను ఇప్పుడు సరిచూసుకుంటున్నారు. ఇక అసలు చర్చలోకి వస్తే… అప్పుడు రాజశేఖర్‌రెడ్డి నమ్మిన బంటుగా ఉన్న సూరీడు.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి దగ్గర కూడా పనిచేస్తారనే పుకార్లు వీస్తున్నాయి._

About The Author