కువైట్ విమానాయశాఖ ఆకస్మిక ప్రకటన ప్రవాసీ ప్రయాణీకులకు చేదువార్త


గత రెండు రోజులుగా నిషేధిత దేశాల నుండి ప్రవాసీలు డైరెక్ట్ గా కువైట్ రావడానికి ఆమోదం తెలిపినట్టు విడుదల చేసిన సర్కూలర్ ఈరోజు రాత్రి 11 గంటలకు అకస్మాత్తుగా DGCA తన ట్విట్టర్ ఖాతాలో ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు తదుపరి నోటీసులు వచ్చేవరకు ప్రవాసీలు రాకను నిలిపివేసింది. కేవలం కువైటీ పౌరులకు మాత్రమే కువైట్ లో హోటల్ క్వారైంటైన్ 7 రోజులు బుక్ చేసుకోవాలని మిగతా 7 రోజులు ఇంట్లో క్వారైంటైన్ లో ఉండాలని తెలిపింది.
అర్ధరాత్రి తాజాగా విడుదల చేసిన సర్కూలర్
ప్రవాసీలు డైరెక్ట్ గా కువైట్ రావడానికి తదుపరి నోటీసులు వచ్చేవరకు నిషేధం కొనసాగించాలని కువైట్ విమానాశ్రయం లో పనిచేసే అన్ని విమానయాన శాఖలకు ఆదేశించిన విమానాయశాఖ
ఈ సర్కూలర్ ప్రకారం కువైటీ పౌరులు మరియు దౌత్య అధికారులు, కువైటీ పౌరులతో వుండే వారి గృహకార్మికులు ,వైద్య సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు అనుమతించనున్నారు.

About The Author