ఎవ్వడికి కావాలి ఈ హిందూ ధర్మం…?? ఎందుకూ ఈ హిందు ధర్మం..??

*ఎవ్వడికి కావాలి ఈ హిందూ ధర్మం*…??

*ఎందుకూ ఈ హిందు ధర్మం*..??

కొడుకో, బిడ్డో పుడితే ఏ ఘడియ లో పుట్టిందో,ఏ జాతకం తో పుట్టిల్లో,ఏ పేరు పెడితే బాగుంటుందో తెలుసుకోవడానికి కావాలి హిందూ ధర్మం …!! (బ్రహ్మణుడు).

పుట్టిన పిల్లలు కు 21రోజు కి,బారసలకు, బాగా చదువుకోవడం కోసం ముహూర్తం కోసం కావాలి హిందూ ధర్మం..!!

*అయినా మాకు ఎందుకు హిందూ ధర్మం*…??

పుట్టిన పిల్లలు పెద్ద పెరిగి,ఉద్యోగంలో చేరడానికి,వ్యాపారం పెట్టడానికి , ఒక ముహూర్తం పెట్టడానికి కావాలి హిందూ ధర్మం..!!

అంతెందుకు అంగరంగ వైభవంగా పెళ్లి నిశ్చయము కి,పెళ్లి కి ముహూర్తం పెట్టడానికి కావాలి హిందూ ధర్మం…!!

*అయినా మాకు ఎందుకూ హిందూ ధర్మం*…!!

ఆపద వస్తే మొక్కడానికి…??

వేములవాడ రాజన్న కావాలి…

ఆపద మొక్కులవాడు వెంకన్న స్వామి కావాలి..

బద్ది పోచమ్మ కావాలి…

గట్టు మైసమ్మ కావాలి…

ఎల్లమ్మ కావాలి…..

సావు బతుకుల వుంటే చల్లగా చూడ్డానికి సమ్మక్క ,సారక్క కావాలి…

*అయినా మాకు ఎందుకూ హిందు ధర్మం*….!!

మా ఊరి గుడిని కూల్చినా పరవాలేదు…

మా గూడు కురవకుండా..ఉంటే చాలు…

మాకు అన్నింటికీ ముహుర్తాలు పెట్టే బ్రహ్మనుడుని ఇతర మతస్థులు కొట్టి చంపిన పరవాలేదు…

కానీ మా ఇల్లు, పిల్లలు మంచిగా వుంటే చాలు…

*అయినా మాకు ఎందుకు హిందూ ధర్మం*…!!

ఖర్మ కాలి మరణిస్తే…..
ఏ తిది లో చనిపోయారో….
ఇల్లు విడవలో….ఉండాలో..
దిన కర్మ ఎప్పుడు పెట్టాలో…

తెలుసుకోవడాని మాత్రం కావాలి హిందూ ధర్మం..!!

*అంతెందుకు….??*

నా దేశం లో ఏమి జరిగినా మాకు ఎందుకు…??

నెల నెలా రేషన్ బియ్యం రావలె..

మేమూ బరిగా తిని, పొయ్యటందుకు ఉచిత లాట్రీన్ రావలె….

మా అవ్వకు, మా అయ్యకు నెల నెలా పింఛన్ రావలే…

బతుకమ్మ చీరో, ఏదయినా ప్రభుత్వం నుంచి పూక్కేడకు వచ్చే ప్రతి పథకం మా ఇంటికి రావలే…
మా నాయకులు ఏమి చేస్తే మాకేంటి…??
ఎన్ని తింటే మాకేంటి…??

మాకు ప్రతి ఐదు ఏళ్లకు ఒక్కసారి రుణమాఫీ చెయ్యాలి..

ఎవ్వడిని బుజాలు మీదకు ఎక్కించుకొంటే మాకేంటి..??

మా కులం కృశించి పోనీ…, మా మతం నాశనం కానీ…

మా సంప్రదాయాలు కను మరుగు అయ్యిపోని….

మా వృత్తులు…కొవ్వొత్తుల ల కరిగిపోని….
మా బ్రతుకులు చితికి పోనీ….

*కానీ*

ఎన్నికలు వచ్చినప్పుడు మా ఇంటికి ఎన్ని ఓట్లు ఉంటే అన్నిటికి 1000/- చొప్పున డబ్బులు రావలె…

మేమూ వాళ్ళు ఏంటో కూడా తెలుసుకోకుండా వోట్లు వెయ్యాలి…
వాళ్ళు మా ఓట్ల తో గెలిచిన *యేసు ప్రభు దయతో* నో…..అల్లాహ్ దాయాతోనో గెలిచాను అంటే..నేను సప్పట్లు కొట్టి ,బాంబులు పేల్చుతా…..

*ఆయనా మాకు ఎందుకు ఈ హిందూ ధర్మం…??*

పాకిస్థాన్ వాళ్ళు మన సైనికులను ఎంత మందిని చంపితే మాకెంది….??

మేమూ మా ఇంట్ల హాయ్ గా పడుకోవలె…

చైనా వాళ్ళు భారత్ లో చొరబడితే మాకెంది …??

చైనా ఫోన్ మాకు అగ్గువగా దొరకెలే…
దాంట్లో గంటలు కొద్దీ మాట్లాడుకోవలె…
హాయ్ గా పాటలు వినలే….

అమెరికా వాడు ఎన్ని ఆంక్షలు పెడితే మాకేంటి…..??
ఎన్ని పన్నులు వసూళ్లు చేస్తే మాకేంటి….??

మా పిల్లలు అమెరికా పోవలే..
అక్కడ చదువుకొని
,అక్కడే ఉండాలే….

ఇరాన్,ఇరాక్,ఇజ్రాయెల్ తో సంబంధాలు ఎట్లు ఏంటి మాకేంటి….??

మా కారులలో, బండ్ల మీద హాయ్ గా తిరగడానికి పెట్రోల్ ,డీజల్ ధరలు తక్కువు ఉండలే….

*అయినా మాకు ఎందుకీ హిందూ ధర్మం..??*

మాకు తిక్క లేస్తే …..
ఎవడైనా మాయ మాటలు చెపితే….
ఇంతకంటే హాయిగా బ్రతకావచ్చు అంటే ఏ మతమైన మారుతం…
ఎ పని అయినా చేస్తాం…

*అరే అన్ని చెప్పి అస్సలు విషయం మరిచిపోయిన*….
మాపటికి ఖచ్చితంగా మందు కావాలె*…
దాని రేటు ఎంతున్నా…
*మేము ధర్నా,రాస్తా రోకోలు చెయ్యంలేండి*..

*అయినా మాకు ఎందుకూ ఈ హిందూ ధర్మం*
భారత దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలకు విలువలు లేనప్పుడు, ఏ భారతీయడికి ఎక్కడికి వెళ్లినా విలువలు ఉండవు.
గొప్పది అయిన మన హిందూ జాతి ఒక తాటి పైకి రావలసిన అవసరం ఎంతైనా ఉంది అని నా అభిప్రాయం.

*జై భారత్……జై జై భారత్*
*భారత్ మాతకి జై*

About The Author