ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??


ఒక వేశ్య జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా గుంగుబాయి కతియావాడి. ఆమె జీవితం సినిమా కథకన్నా ఉత్కంఠగా ఉంటుంది..ముంబైలోని ప్రముఖ రెడ్ లైట్ ఏరియా కామాటిపురలో చాలాఇళ్లలో గుంగుబాయి ఫొటో ఉంటుంది. అక్కడ ఆమె విగ్రహం కూడా ఉంటుంది. ఆమె ముంబై వేశ్యలకు అమ్మ.. వాళ్లకు రక్షణగా నిలిచిన వేశ్యా రాణి.. గుజరాత్ లో సంపన్న కుటుంబానికి చెందిన గంగూబాయి , తన తండ్రిదగ్గర పనిచేసే యువకుడిని ప్రేమించి ముంబైకి వచ్చేసింది. కొంతకాలం ఆమెతో కాపురంచేసిన ఆ యువకుడు , గంగూబాయిని వేశ్యావాటికలో అమ్మేసి వెళ్ళిపోయాడు. అక్కడినుంచి వేశ్యగా ఆమె జీవితం మొదలైంది.అప్పట్లో ముంబై డాన్ , కరీమ్ లాలకు రాఖీ కట్టి , అతడికి దేవుడిచ్చిన చెల్లెలు అయింది. కరీమ్ లాలా అండతో వేశ్యామాతగా ఎదిగింది.ముంబైలో సంపన్నులకు , అందమైన అమ్మాయిలను పంపే స్థాయికి . ఆ విధంగా కోట్లు సంపాదించింది. అసలు , సిసలు బంగారు జరీ చీరలు కట్టేంత స్థాయికి ఎదిగింది. ఆ కాలంలోనే ఆమెకు బెంట్లే కారు ఉండేది. అయితే ఆమెకు కామాటిపురలో విగ్రహాలు , ప్రతి వేశ్య ఇంట్లో ఫొటోలు ఎందుకో తెలుసా..? ఆమె వేశ్యలకు , మాఫియాలనుంచి రక్షణగా నిలిచింది. వేశ్యల పిల్లలకోసం తన సంపాదన ఖర్చు చేసేది. వాళ్ళ బాగోగులు చూసేది. ఎవరైనా బలవంతంగా ఆ వృత్తిలో ఉంటే , వాళ్లను ఇళ్లకు పంపించేది. ఇలా 1960లలో ముంబై రెడ్‌లైట్‌ ఏరియా అయిన కామాటిపురాలో చక్రం తిప్పిన మేడమ్‌ గంగుబాయి కతియావాడీ. ఇప్పుడు ఆమె బయోపిక్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది. గుంగుబాయిగా ఆలియాభట్‌ నటించింది.

About The Author