విశాఖ స్టీల్ పై బీజేపీ మొండితనం..?
బీజేపీ తెగిస్తోంది. దుస్సాహసమే చేస్తోంది. గత ప్రభుత్వాలు చేయని ఎన్నో పనులు తానే చేశానని గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీ తాజాగా దేశానికి ప్రైవేటీకరణే శరణ్యం అంటూ బాంబు పేల్చింది.
ఈ దేశంలో ప్రభుత్వాలు పాలించడానికే ఉన్నాయని, వ్యాపారాలు చేయడానికి కాదని కొత్త సూత్రీకణంతో బంగారం లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పాలు చేసేందుకు దూకుడు చేస్తోంది.
తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేస్తోంది. అందులో ఇద్దరు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులకు కూడా చోటు కల్పించడం ద్వారా ప్రీవేటీకరణను వేగవంతం చేయాలనుకుంటోంది.
అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధిచిన వివరాలను కూడా అధికారుల నుంచి సేకరిస్తోంది. ఇలా వడి వడిగా కేంద్రం అడుగులు వేస్తూండడంతో విశాఖలో కార్మికుల్లో అలజడి రేగుతోంది.
దాంతో ఉక్కు ఉద్యమం కొత్త రూపు తీసుకుంటుంది అంటున్నారు. ఓ వైపు జీవీఎంసీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఉక్కు ఉద్యమం కనుక చెలరేగితే రాజకీయ కాక పెద్ద ఎత్తున ఎగిసిపడుతుందని చెబుతున్నారు.