బ్రెడ్ దొంగతనం చేసిన కుర్రాడు… జరిగిన కథ…


పోలీసులు ఒక 15 ఏళ్ళ కుర్రాడిని అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టారు..
జడ్జి విషయమేంటని అడిగితే
ఈ అబ్బాయి ఒక బేకరీ లో బ్రెడ్ దొంగతనం చేసి పారిపోతుండగా అక్కడ వాచ్మాన్ పట్టుకున్నాడని అప్పుడు అక్కడ ఉన్న పెద్ద అద్దం పగిలిపోయిందని అందుకుగాను ఆ యజమాని కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పారు.

జడ్జి : దొంగతనం చేసావా..?
పిల్లాడు : అవును చేసాను.

జడ్జి : ఏం దొంగతనం చేసావు.?
పిల్లాడు : బ్రెడ్ ప్యాకెట్.

జడ్జి : డబ్బులిచ్చి తీసుకుని ఉండొచ్చుగా..
పిల్లాడు : డబ్బులు లేక తీసుకున్నాను.

జడ్జి : ఇంట్లో వారిని అడిగి ఉండొచ్చుకదా..?
పిల్లాడు : అమ్మ మాత్రమే ఉన్నారు అందులోనూ
అనారోగ్యంగా అన్నాడు.

జడ్జి : ఏదైనా పని చేయొచ్చుగా..?
పిల్లాడు : ఒక కారు షెడ్ లో పనిచేస్తుండేవాడిని
అమ్మకు అనారోగ్యమని ఒక్కరోజు
సెలవు పెట్టినందుకు పని నుండి తీసేసారు.

జడ్జి : ఇంకెక్కడైనా పని చేయొచ్చుగా
పిల్లాడు :ఉదయం నుండి యాభై మంది దాకా పని
అడిగాను ఒక్కరుకూడా ఇవ్వలేదు.
సూర్యుడు అస్తమించేసాడు..ఇక ఏమీ
చేయలేక ఈ పనిచేశానని..
తలదించుకున్నాడు.

పిల్లాడితో సంభాషించాక జడ్జి తీర్పు రాయడం మొదలుపెట్టారు.
ఈ రోజు ఈ పిల్లాడి పరిస్థితికి అందరం నేరస్థులమే నాతో సహా..
ఆకలి అంటున్న అబ్బాయికి ఒక్క స్నేహ హస్తాన్ని అందించలేక పోయాము.
అందుకు జరిమానా ఇక్కడ కోర్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇతడిని పట్టుకున్న పోలీసులు నాతో సహా అందరూ 500 రూపాయల చొప్పున కట్టాలి.
ఏ ఒక్కరు కట్టకుండా బయటకు వెళ్ళకూడదు.
ఇక ఇతడి పై కేసు పెట్టిన షాప్ యజమాని 5000 వేల రూపాయలు జరిమానా కట్టాలి.

ఈ మొత్తాన్ని ఆ పిల్లాడికి అందించాలి..అని తీర్పు రాశారు.
ఆ పిల్లాడు అక్కడ ప్రజలు ఆ జడ్జి తీర్పుకు ఆశ్చర్యపోయారు.
ఆ పిల్లాడు తల ఎత్తి జడ్జిని చూడగా బాధతో కళ్ళ వెంట కన్నీళ్లు.

సమాజంలో ఆకలి కోసం దొంగతనం జరుగుతున్నది అంటే మనం అందించలేని ఆ స్నేహ హస్తమే కారణం అని ఆ జడ్జి తలవంచుకున్నారు.

ఇంకా ఏదో ఒక మూల నీతి నిజాయితీ బతికే ఉన్నదని ఇలాంటి వారిని చూసినప్పుడే అనిపిస్తున్నది.

ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం..మంచి పని.
ఆకలి విషయంలో అబద్ధం ఆడలేరు కదా ఎవరైనా.

About The Author