ఆవు మూత్రంతో ఉపయోగాలు…
* శ్లేష్మవ్యాధులు హరించుట కొరకు –
ప్రతినిత్యం వడకట్టిన గోమూత్రమును 25 గ్రాముల చొప్పున త్రాగుచుండిన యెడల శ్లేష్మము వలన కలుగు వ్యాధులు అన్నియు హరించును .
* విరేచనములు అగుట కొరకు –
ఎన్ని విరేచనములు అవ్వవలనో అన్నిసార్లు గోమూత్రమును గుడ్డతో వడకట్టి 30 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు ప్రాతఃకాలం నందు పుచ్చుకొనుచున్న యెడల విరేచనములు అగును.
* ఉదరవ్యాధులు హరించుట కొరకు –
గోమూత్రంలో కొంచం పటికబెల్లం పొడి , కొంచం ఉప్పు కలిపి త్రాగుచుండిన యెడల కడుపుకు సంభందించిన వ్యాధులు అన్ని హరించిపోవును.
గోమూత్రంలో కొంచం ఆవాల చూర్ణం , కొంచం సైన్ధవలవణం చూర్ణం కలుపుకుని ప్రతినిత్యం త్రాగుచుండిన యెడల ఉదరవ్యాధులు అన్ని హరించును .
* చిన్నపిల్లల కడుపుబ్బరం హరించుటకు
ఒక తులం గోమూత్రం లో ఒక చిటికెడు పసుపు చూర్ణం కలిపి పూటకొక్క మోతాదుగా రోజూ రెండుపూటలా త్రాగించుచుండిన యెడల చిన్నపిల్లలకు కలిగే కడుపుబ్బరములు హరించును .
* పాండు వ్యాధి హరించుటకు –
వడకట్టిన గొమూత్రం ను మూడున్నర తులములు ( 30ml ) ప్రతినిత్యం ప్రాతః కాలంనందు త్రాగుచుండిన యెడల పాండువ్యాధి 20 నుండి 40 రోజుల్లో హరించును .
* చెవిలో చీము హరించుట కొరకు –
గొరువెచ్చని గోమూత్రములో చెవులను కడుగుచుండిన యెడల చెవి నుండి చీము కారుట హరించును .
* స్త్రీ వ్యాదులు కొరకు –
గోమూత్రము 40ml పూటకొక్క మోతాదుగా రోజూ రెండుపూటలా త్రాగించుచుండిన యెడల స్త్రీలకు వచ్చు సూతికావ్యాధి దానివలన కలుగు వళ్లువాపు , గర్భాశయం గట్టిపడుట హరించి ఆరోగ్యముగా ఉండును.
* జీర్ణజ్వరములు హరించుటకు –
నెలవేము రసం 20ml , గోమూత్రం 30ml కలిపి పూటకొక్క మోతాదుగా రోజూ రెండుపూటలా త్రాగుచుండిన యెడల జీర్ణజ్వరములు , పాండువ్యాధి , వళ్లువాపులు 7 రోజులలో హరించిపొవును.
* మూత్రకృచ్చం హరించుటకు –
ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు 20ml గోమూత్రం , 125ml నీటిలో కలుపుకుని త్రాగుచుండిన యెడల మూత్రం బిగింపు హరించి మూత్రం ధారాళంగా వెడలించుచుండును.
* మలబద్ధకం , అరుచి హరించుటకు –
ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు గోమూత్రం 30ml , పటికబెల్లం పొడి 20ml త్రాగుచుండిన యెడల మలబద్దకం హరించి నోటికి రుచి కలుగును.