గుండె జబ్బులు – ఆహార నియమాలు – ఔషధాలు …


గుండెజబ్బు రావడానికి గల కారణాలు –

* అతిగా ఆవేశపడటం.

* ఎక్కువుగా ఉన్న వేడి పదార్దాలు తినడం.

* పులుసు , వగరు ఉన్న రుచులు ఎక్కువ ఉన్న పదార్దాలు తినడం.

* విచ్చలవిడిగా కామకలాపాలు సాగించడం .

* అతిసారం

* జీర్ణకోశం లో వ్రణాలు .

* విషపదార్దాల సేవనం .

* మానసిక ఆందోళన .

* రక్తపోటు .

* కొవ్వు పేరుకొని పోవడం.

* అధికంగా గోంగూర వాడటం.

మొదలైన వాటివల్ల గుండె జబ్బులు వస్తాయి.

గుండె రోగులు పాటించవలసిన నియమాలు –

* ఎప్పుడు పాత బియ్యమే ఆహారంగా ఉపయోగించాలి. దంపుడు బియ్యమే శ్రేష్టం .

* మేక మాంసం , అడివి పక్షుల మాంసం , అడివి మృగాల మాంసం తో తయారైన మాంస రసాలు త్రాగవచ్చు.

* అల్లం, ఉప్పు, కొద్ది కారం , కొద్దిగా యాలుక్కాయలు , లవంగాలు , దాల్చిన చెక్క, ఇవన్ని కలిపి నూరి ఆ మిశ్రమాన్ని మాంసం ముక్కలకు రాసి ఎండబెట్టాలి. ఎండిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆవునేయ్యిలో వేయించుకొని తినవచ్చు.

* పులుపు, వగరు రుచులు బాగా తగ్గించాలి.

* కందికట్టు, పెసరు కట్టు, ఉలవ కట్టు వాడవచ్చు.

* బీర, కాకర, క్యాబేజీ , టమాటో , లేత ముల్లంగి పొట్లకాయ , లేత అరటికాయ , పొన్నగంటి కూర , పెరుగుతోట కూర , మెంతి కూర , సొరకాయ , దోసకాయ తినాలి .

* మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు , బత్తాయి రసం ( కలకండ రసం కలిపింది.) నారింజ రసం , ద్రాక్ష రసం వాడవచ్చు.

* ఆవుపాలు, ఆవునెయ్యి , ఆవుమజ్జిగ , పాతబెల్లం , తేనె , ద్రాక్షారిష్ట, అర్జునారిష్ట , వెల్లుల్లి , అల్లం వాడవచ్చు.

గుండె రోగులు మానుకోవలసినవి –

* కొత్తబియ్యం అన్నం తినకూడదు .

* పెరుగు వాడరాదు . మజ్జిగ వాడవలెను.

* పులుపు, వగరు రుచులు బాగా తగ్గించాలి.

* ఎప్పుడు దాహం , వాంతి రాకుండా చూసుకోవాలి .

* మలమూత్రాలు ఎక్కువసేపు ఆపకుండా వచ్చినవెంటనే విసర్జించాలి.

* దగ్గు, తేన్పులు , అపానవాయువు వీటిని ఆపకూడదు .

* పుల్లలతో పండ్లు తోముకోకుడదు.

* పొగత్రాగటం పూర్తిగా మానుకోవాలి.

* మద్యం, గేదపాలు అసలు పనికిరావు.

* తాంబూలం వేసుకొకుడదు .

* ఆవకాయ తినడం అత్యంత ప్రమాదకరం .

పైన చెప్పిన ఆకుకూరలు తప్ప మిగిలనవి బాగా తగ్గించడం శ్రేయష్కరం .

గుండె నొప్పి మరియు గుండెబలమునకు సిద్ధఔషధ యోగాలు –

* తమలపాకు జీర్ణాశయమునకు మరియు హృదయమునకు బలాన్ని కలిగించును.

* మునగచెక్క రసము నందు కొంచం ఇంగువ చేర్చి ఇచ్చిన గుండెనొప్పి తగ్గును.

* గులాబీల నుండి తయారుచేసిన పన్నీరు గుండెదడ , గుండెపోటు , ఆయాసములను తగ్గించును .

* అంజూర పండ్ల రసమును రోజుకు ఒకసారి తీసుకున్నచో గుండెకి , ఊపిరితిత్తులకు బలాన్ని కలుగచేయును .

* ద్రాక్షపండ్ల రసము గుండెకు , మూత్రపిండాలకు బలాన్ని కలుగచేయును .

* ఒక ఔన్స్ సొంపు కషాయంలో రెండు చెంచాల పంచదార కలిపి రోజుకు రెండుసార్లు పుచ్చుకున్న ఛాతినొప్పి , ఉపిరి తీసుకునేప్పుడు నొప్పి , గుండెనొప్పి తగ్గును.

* ఖర్జుర పండు గుండె , ఊపిరితిత్తులు , మూత్రపిండములు , లివర్ మొదలగు శరీరావయములకు మిక్కిలి ఉత్తేజాన్ని కలిగించి బలమును , పుష్టిని ఇచ్చును .

* ప్రతినిత్యం ఉదయాన్నే ఒక అంజూరపండు తినుచున్న గుండెదడ , ఆయాసం తగ్గును.

About The Author