ఆస్తులు ముఖ్యం కాదు అమ్మ ముఖ్యం అని అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్న తమ్ముళ్లు……
ఆస్తులు ముఖ్యం కాదు అమ్మ ముఖ్యం అని అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్న తమ్ముళ్లు……
అమెరికాలో టాప్ 10 డాక్టర్స్ లో ఒకరు రాజాశ్రీనివాస్.. మరొకరు అమెరికా తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్..
రెండు నెలలు కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని 60 రోజులకు పైగా హైదరాబాద్ ప్రముఖ హాస్పిటల్ AIG లో కరోనాతో కొన ఊపిరితో పోరాడుతున్న తల్లి బారతమ్మ గారు ఉన్న ICU రూములో అమ్మతో పాటు ఉండి అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ జన్మనిచ్చిన అమ్మను బ్రతికించుకున్నారు ఈ అన్న దమ్ముళ్ళు..
ఈ ప్రపంచంలో ఈ భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులను మించిన ఆస్తి, తల్లిదండ్రులను మించిన దైవం లేదు అని నేటి సమాజానికి, నేటి యువతకు తెలియజేసిన వీరిని ఎంత పొగిడినా తక్కువే..
నేటి తరానికి ఆదర్శమూర్తులారా మీకు మా అభినందన నమఃసుమాంజలులు