వాట్సాప్‌ సేవలను ప్రారంభించిన ఈపీఎఫ్‌ఓ..


ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) తన చందాదారుల సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఈపీఎఫ్‌ఓ వినియోగదారులు సులభంగా తమ సమస్యలను పరిష్కరిచుకునే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న పని కోసం ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లకుండానే ఈ ఏర్పాట్లు చేసినట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఇంతకు ముందే ఈపీఎఫ్‌ఓ ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవియన్స్‌ రిడ్రెస్సల్‌ ఫోరంను ప్రారంభించింది. ఇందులో భాగంగానే వాట్సాప్‌ హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రకటించింది. సమస్యల పరిష్కారం కోసం EPFIGMS, CPGRAMS పోర్టళ్లతో పాటు ప్రత్యేకంగా 24×7 కాల్ సెంటర్ కూడా అందుబాటులో ఉంది. వీటికి అదనంగా మరో సేవలను అందుబాటులోకి తీసుకువస్తూ వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రారంభించింది. ఈ సదుపాయం ద్వారా పీఎఫ్ చందాదారులు డిజిటల్ విధానంలో ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవచ్చు. అవసరమైన సమాచారాన్ని నేరుగా పొందవచ్చు. ఈపీఎఫ్‌ఓకు చెందిన మొత్తం 138 ప్రాంతీయ కార్యాలయాలలో వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ సర్వీసులను ప్రారంభించింది. పీఎఫ్ చందాదారులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేస్తే సరిపోతుంది. ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయల వాట్సాప్ నెంబర్ కోసం అధికారిక వెబ్ సైట్ సందర్శించండి.

About The Author