తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు కి అనుమతి నిరాకరణ


?తిరుపతిలో టిడిపి నేత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేపట్టిన నిరసనలలకు పోలీసులు అనుమతి నిరాకరణ
?ఎన్నికల కోడ్ నిబంధనలు వున్నందున చంద్రబాబు నాయుడు గారి నిరసనలకు అనుమతించటం లేదు డి ఎస్పి ఈస్ట్ డిఎస్పీ
?టిడిపి అధినేత తిరుపతి లో గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు
చేపట్టాలని నిర్ణయించారు
?తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసనలకు అనుమతిలేదని ఈస్ట్ డి ఎస్పీ టిడిపి పార్టీ కర్యలనికి,తిరుపతి మాజీ ఎమ్మెలే సుగుణమ్మకు,నరసింహ యాదవ్ కు నోటీసులు జారీ
?పోలీస్ యాక్ట్ మాడల్ కోడ్ అమలు లో ఉండడంతో నిరసనలకు అనుమతి నిరాకరణ..
మీకు తెలియజేయడo ఏమన గా వివిద సామాజిక మద్యమాల (సోషల్ మీడియా) ద్వారా మాకు రాబడిన సమాచారం మేరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యామంత్రి ఆంధ్ర ప్రదేశ్ వారు ఈ దినం అనగా 01-03-2021 వ తేదీ సాయంత్రం 04-00 గంటలకు తిరుపతి లోని గాంధీ విగ్రహం దగ్గర, ముందుగా పేర్కొనబడని (చెప్పబడని) కార్యక్రమము చేయదలచారని తెలిసినది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలు లో వున్నందున మీరు ముందస్తుగా అనుమతి తీసుకోవలయును, అప్ప్లికేంట్స్ దగ్గర సరైన రీతిలో అండర టేకింగ్ తీసుకొని అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ పక్రియ కోసం కనీసం సమయం పోలీసు వారికి కలిపించవలసివుంటుంది. మీరు చెప్పట్టే కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదు మరియు మీరు ఈ క్రింద విషయాలు గమనిచగలరు.

 మీరు చేసే ప్రోగ్రాం APS RTC బస్ స్టాండ్ కు మరియి రైల్వే స్టేషన్ కు మద్యలో ఉన్నందున తిరుపతి తిరుమలకు వచ్చు యాత్రికులకు తీవ్ర అసౌకర్యం కలిగే అవకాశం వుంది.
 అత్యవసర సేవలకు అంతరాయము కలిగి ఆందోళనలు పేళ్లుబోకే అవకాశం వుంది.
 వృద్దులు, గర్బినీలు మహిళలు మరియు పిల్లల రాక పోకలకు తీవ్ర అంతరాయము కలిగే అవకాశంవుంది.
 వాహనాల రాక పోకలకు తీవ్ర అంతరాయము కలిగే అవకాశం వుంది.
 ప్రజాశాంతికి భంగం మరియు శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం వుంది.
 వ్యాపార లావాదేవిల కు విఘాతం కలిగి జీవనోపాది (lively Hood) కి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.

ప్రస్తుతం జరుగుతున్న తిరుపతి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తిరుపతి పట్టణంలో 30 పోలీస్ యాక్టు మరియు Sec. 144 సి ఆర్ పి సి మరియు మోడల్ కోడ్ ఆఫ్ కాండేక్ట్ (MCC) అమలులో వున్నందున, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు నిరసనలు మరియు అన్ని కార్యక్రమాలు నిషేదించడమైనది. మీరు చేసే కార్యక్రమం వలన ప్రజల మద్య భావో ఉద్వేగాలు ఏర్పడి, దాని వలన సున్నితమైన వాతావరణం ఏర్పడి దాని వలన ప్రశాంత వాతావరణనికి భంగం కలిగే అవకాశం వుంది మరియు తిరుపతి పట్టణము లో కోవిడ్ పెరిగే అవకాశం వున్నది. కావున మీరు దయ ఉంచి మాకు సహకరించ ప్రార్తన.
మీరు చేయు తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమము లో కొన్ని ఆసాంఘిక శక్తులు పాల్గొని తీవ్రమైన చర్యల కు ఉపక్ర మించే అవకాశం వూన్నదని తెలుస్తున్నది. కావున మీరు ఈ ప్రయతన్నమును విరమించుకోవాలని ప్రార్తన.

లేని ఎడల మీరు ఉద్దేశ్యస పూర్వకముగానే చేస్తున్నారని భావించి జరగబోవు ఆస్తి, ప్రాణ మరియు ఇతర నష్టాలకు మిమ్మ్లని భాద్యలని చేయవలసి వస్తుంది. ప్రజాశాంతి ని మరియు శాంతి, భద్రతలు కాపాడుట లో మీరు పోలీసులకు ప్రజలకు సహకరిస్తారని విన్నవించుకుంటున్నాము.

సబ్-డివిజనల్ పోలీసు ఆఫీసర్,
ఈస్ట్ సబ్-డివిజన్,
తిరుపతి.తేదీ:01-03—2021.

About The Author